Ad Code

హోలీ అయోధ్య యాప్ !


యోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ 'హోలీ అయోధ్య' అనే కొత్త యాప్‌ను ప్రారంభించింది. అయోధ్యలో తక్కువ ధరకు వసతి అందించే హోమ్‌స్టేలను బుక్ చేసుకోవడానికి ఈ యాప్‌ను ఉపయోగించవచ్చు. హోమ్‌స్టేలు అనేవి రెసిడెన్షియల్ ప్రాపర్టీలు. ఇవి కమర్షియల్ కంపెనీలైన హోటళ్లలా కాకుండా అతిథులకు అద్దెకు గదులను తక్కువ ధరలకే అందిస్తాయి. యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ డివైజ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ లేదా ADA వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాపులర్ హోటల్ బుకింగ్ యాప్స్‌ లాంటి యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ను ఆఫర్ చేస్తుంది. అయితే, యాప్ అయోధ్యలోని హోమ్‌స్టేల లిస్ట్స్‌ మాత్రమే చూపుతుంది, హోటల్స్‌ లేదా ఇతర రకాల వసతిని చూపదు. యాప్‌లో అందుబాటులో ఉన్న హోమ్‌స్టేలను ఈజీగా చెక్ చేయవచ్చు. హోమ్‌స్టేల ఫొటోలు, ఫెసిలిటీస్, లొకేషన్, రేటింగ్స్‌, రివ్యూలను కూడా చెక్ చేయవచ్చు. ప్రాధాన్యతలకు, బడ్జెట్‌కు తగిన హోమ్‌స్టేను సెలక్ట్ చేసుకోవచ్చు. యాప్‌లో హోమ్‌స్టే ఓనర్ల కాంటాక్ట్ డీటేల్స్ కూడా ఉంటాయి. ఈ వివరాల ద్వారా బుక్ చేసుకునే ముందు ఏవైనా ప్రశ్నలు లేదా సహాయం కోసం వారిని సంప్రదించవచ్చు. యాప్ యూజర్లు ఫోన్ నంబర్‌ను అందించి, ముందుగా ఫుల్ అమౌంట్ చెల్లించి హోమ్‌స్టేలో రూమ్ బుక్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, UPI లేదా ఈ-వాలెట్‌ల వంటి వివిధ ఆన్‌లైన్ మోడ్స్‌ ద్వారా పేమెంట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. యాప్‌లో ఫ్లెక్సిబుల్ క్యాన్సిలేషన్ పాలసీ కూడా ఉంది. దీని ద్వారా యూజర్లు బుకింగ్‌ను క్యాన్సిల్ చేయవచ్చు. చెక్-ఇన్ సమయానికి కనీసం 24 గంటల ముందు క్యాన్సిల్ చేస్తే ఫుల్ రిఫండ్ పొందవచ్చు. అయితే, చెక్-ఇన్ సమయం నుంచి 24 గంటలలోపు క్యాన్సిల్ చేస్తే వాపసు లభించదు. చాలా హోమ్‌స్టేలకు చెక్-ఇన్ సమయం 2PMగా ఉంటుంది. అయితే ఇది హోమ్‌స్టే ఓనర్ రూల్స్‌ను బట్టి మారవచ్చు. యూజర్లు చేరుకోవడానికి ముందు యజమానితో చెక్-ఇన్ టైమ్ నిర్ధారించుకోవాలి. యాప్ ఎలాంటి మధ్యవర్తులు లేదా ఏజెంట్లపై ఆధారపడకుండా, అయోధ్యలో హోమ్‌స్టేని కనుగొని బుక్ చేసుకోవడానికి సురక్షితమైన, సులభమైన మార్గాన్ని అందిస్తుంది. అయోధ్య స్థానిక సంస్కృతి, ఆతిథ్యాన్ని అనుభూతి చెందడానికి పర్యాటకులు ఈ యాప్ వినియోగించవచ్చు, ఎందుకంటే వారు నగర నివాసితులతో కలిసి ఉండే, వారితో సంభాషించే అవకాశం లభిస్తుంది. యాప్ హోమ్‌స్టే యజమానులు, యజమానుల కుటుంబాలకు ఆదాయం, ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. అయోధ్యలో హోమ్‌స్టే పథకం కింద 500 కంటే ఎక్కువ భవనాలు, 2200 గదులు రిజిస్టర్ అయ్యాయి, ఈ యాప్ పర్యాటకులకు ఎంచుకోవడానికి అనేక ఆప్షన్స్ అందిస్తుంది. రూమ్ టారిఫ్‌లు సగటున రూ. 1000 నుంచి ప్రారంభమవుతాయి, ఈ ధర నగరంలోని హోటళ్ల కంటే చాలా చౌకగా ఉంటుంది. యూజర్లు, హోమ్‌స్టే ఓనర్ల ఫీడ్‌బ్యాక్, సూచనల ఆధారంగా యాప్ అప్‌డేట్స్‌ పొందుతుంది. ఈ యాప్ iOS డివైజ్‌లు, ఇతర ప్లాట్‌ఫామ్‌ల కోసం కూడా అందుబాటులోకి వస్తుంది. యాప్‌లో ట్రావెల్ గైడ్స్‌, మ్యాప్‌లు, డైరెక్షన్స్, ఫుడ్, షాపింగ్, ఈవెంట్లు వంటి ఇతర ఫీచర్లు, సర్వీస్‌లు సైతం అందుబాటులోకి రావచ్చు.

Post a Comment

0 Comments

Close Menu