Ad Code

వాట్సాప్ లో ఛాట్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ !


వాట్సాప్‌లోని ఛాట్‌ హిస్టరీని బ్యాకప్‌ చేయకుండానే కొత్త స్మార్ట్‌ఫోన్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకొచ్చింది. ఇందుకోసం  'వాట్సాప్ ఛాట్‌ ట్రాన్స్‌ఫర్‌' అనే ఆప్షన్‌ను వాడాల్సి ఉంటుంది. క్లౌడ్‌ ఆధారంగా పనిచేసే బ్యాకప్‌ కంటే ఈ ప్రక్రియ చాలా ఫాస్టుగా, ఈజీగా ఉంటుంది. ఈ ఫీచర్‌ను వాడటం కోసం పాత ఫోన్, కొత్త ఫోన్ రెండు కూడా దగ్గరే ఉండాలి. ఆ రెండింటినీ ఒకే వైఫైకి కనెక్ట్‌ చేసుకోవాలి. తరువాత సర్వీసును ఆన్ చేయాలి.  ముందుగా పాత ఫోన్‌లోని వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఛాట్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌ను ఎంపిక చేయండి. ఆ వెంటనే ఛాట్‌ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించి ప్రక్రియ  పాత ఫోన్‌లో ప్రారంభమవుతుంది. పాత ఫోన్‌లో ఒక క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ ఓపెన్‌ అవుతుంది.  కొత్త ఫోన్‌లోనూ వాట్సాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని పాత ఫోన్‌ నంబర్‌తో లాగిన్‌ కావాలి. పాత ఫోన్‌కు వచ్చే వెరిఫికేషన్‌ కోడ్‌ను కొత్త ఫోనులో ఎంటర్‌ చేయాలి. ఆ వెంటనే కొత్త ఫోనులో ఒక క్యూఆర్‌ కోడ్‌ కనిపిస్తుంది. ఈ క్యూఆర్ కోడ్‌ను పాత ఫోన్‌లో చూపించే స్కానర్‌తో స్కాన్‌ చేయండి. ఇది జరిగిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే మీ పాత ఫోనులోని ఛాట్ హిస్టరీ  డేటా మొత్తం కొత్త ఫోన్‌లోకి వచ్చేస్తుంది. అయితే ఈ ప్రాసెస్ జరిగే టైంలో రెండు ఫోన్లను పక్కపక్కనే ఉంచాలి. స్క్రీన్‌లు కూడా ఆన్‌లో ఉంచడం మర్చిపోవద్దు. 

Post a Comment

0 Comments

Close Menu