Ad Code

మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో ఉపయోగించే కీలక భాగాలకు దిగుమతి సుంకాన్ని తగ్గింపు


భారత ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్‌ల తయారీలో ఉపయోగించే 'కీలక భాగాల'పై దిగుమతి సుంకాన్ని  తగ్గించింది. కొత్త దిగుమతి సుంకం 15% నుండి 10%గా నిర్ణయించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ (రెవెన్యూ శాఖ) అధికారిక నోటిఫికేషన్ ప్రకారం "సెల్యులార్ మొబైల్ ఫోన్‌ల కోసం స్క్రూ, సిమ్, సాకెట్ లేదా మెటల్ ఇతర మెకానికల్ వస్తువులు" వంటి కీలక భాగాలపై దిగుమతి సుంకం తగ్గింపు ప్రకటించింది. హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లను ఉత్పత్తి చేయడానికి కీలకమైన భాగాలపై సుంకాన్ని తగ్గించడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ముందస్తు నివేదికల నేపథ్యంలో మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Post a Comment

0 Comments

Close Menu