Ad Code

స్మార్ట్‌వాచ్‌తో టీవీ, లైట్లను కంట్రోల్ చేసే యాప్ ?


స్మార్ట్‌వాచ్‌లతో చాలా సులభంగా వివిధ డివైజ్‌లను కంట్రోల్ చేయవచ్చు. అయితే ఈ గ్యాడ్జెట్లలో ఒక మైనస్ ఉంది. స్మార్ట్‌వాచ్‌ల బ్యాటరీ లైఫ్ చాలా తక్కువగా ఉంటుంది. ఏవైనా పనులు చేస్తే వెంటనే డిశ్చార్జ్ అవుతుంది. దీనికి పరిష్కారంగా డబుల్‌పాయింట్ అనే స్టార్టప్ ఒక కొత్త యాప్‌ను తయారు చేసింది. ఈ యాప్ ద్వారా స్మార్ట్‌వాచ్‌తో టీవీని ఆన్ చేయవచ్చు, నెట్‌ఫ్లిక్స్ కూడా కంట్రోల్ చేయవచ్చు లేదా సింపుల్ జెస్టర్స్‌తో, కంటి కదలికలతో లైట్లను డిమ్ చేయవచ్చు. ఈ యాప్‌ను ఫిన్‌లాండ్‌కు చెందిన స్టార్టప్ డబుల్‌పాయింట్ డెవలప్ చేసింది. ఈ యాప్‌ను "వావ్ మౌస్" అంటున్నారు. పేరు తగినట్లే ఇది మౌస్ లాగా పని చేస్తుంది. ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లకు కూడా కనెక్ట్ అవుతుంది. లాస్ వెగాస్‌లో జరిగిన అతిపెద్ద టెక్ ఈవెంట్ కన్స్యూమర్ టెక్నాలజీ అసోసియేషన్ లో ఈ యాప్‌ను డబుల్‌పాయింట్ సంస్థ ప్రదర్శించింది. డబుల్‌పాయింట్‌ టీమ్ CES అన్‌వీల్డ్‌లో రెండు డెమోలను చూపించింది. వాటిలో లైట్ కంట్రోల్ ఒకటి. యాప్ ఇన్‌స్టాల్ చేసిన వాచ్ ధరించినప్పుడు మణికట్టును లైట్ మీద అటూ ఇటూ తిప్పగానే, ఆ లైట్ కాంతిని కంట్రోల్ చేసింది. లైట్ కంట్రోల్, యూజర్ల కదలికల మధ్య ఫీడ్‌బ్యాక్‌లో దాదాపు ఎటువంటి ల్యాగ్ కనిపించలేదు. లైట్‌కు వాచ్ చూపగానే, అది ఆన్ అయింది, రిస్ట్ ఫ్లిక్‌తో ఆఫ్ అయింది. ఈ యాప్ ఆండ్రాయిడ్‌ వేర్ఓఎస్ స్మార్ట్‌వాచ్‌లపై పని చేస్తుంది. ఇల్లు లేదా ఆఫీస్‌లోని వివిధ డివైజ్‌లకు స్మార్ట్‌వాచ్‌ను కనెక్ట్ చేయడానికి యాప్ బ్లూటూత్‌పై ఆధారపడుతుంది. కనెక్ట్ చేశాక, కమాండ్స్ ఇవ్వడానికి వేలితో నొక్కాలి లేదా మణికట్టు తిప్పడం వంటి ఫీచర్లు ఉపయోగించవచ్చు. స్క్రీన్‌పై వర్చువల్ కర్సర్‌ను మూవ్ చేయడానికి ఐ ట్రాకింగ్‌ని కూడా ఉపయోగించవచ్చు. ఇన్ని అదిరిపోయే ఫీచర్లు అందిస్తున్న ఈ యాప్‌కు మీడియా నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇది ప్రస్తుతానికి ప్రజలకు అందుబాటులో లేదు.


Post a Comment

0 Comments

Close Menu