Ad Code

సిట్రోయెన్‌ C3 ఎయిర్‌క్రాస్‌ ఆటోమేటిక్‌ డిజైన్‌ ఇంజిన్ !


ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్‌ గత సంవత్సరం ఆగస్టులో 4 మెట్రిక్‌+ SUV సెగ్మెంట్‌లోకి సిట్రోయెన్‌ C3 ఎయిక్‌క్రాస్‌ ద్వారా ప్రవేశించింది. డిజైన్‌ సహా ఇతర లుక్స్‌తో ఆకట్టుకుంది. డైవింగ్‌ అనుభూతి, టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ పనితీరుతో ఆకట్టుకుంది. గత సంవత్సరం విడుదల సమయంలో సిట్రోయెన్‌ C3 ఎయిర్‌క్రాస్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో 6 స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌, తేలికపాటి క్లచ్‌తో అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఈ వాహనం ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ వేరియంట్‌లో  అందుబాటులోకి వచ్చింది. C3 ఎయిర్‌క్రాస్‌లో ఆటోమేటిక్‌ వెర్షన్‌ను మాత్రమే సిట్రోయెన్‌ తీసుకొచ్చింది. దీనిలో 6-స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను అమర్చింది. ఈ గేర్‌బాక్స్‌ను జపాన్‌కు చెందిన Aisin నుంచి తీసుకుంది. ఈ ఆటోమేటిక్‌ వెర్షన్‌ 1.2 లీటర్‌ టర్బో ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్‌ గత మోడల్‌ కంటే 15Nm టార్క్‌ను అదనంగా ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా ఈ ఇంజిన్‌ గరిష్ఠంగా 205Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరియు 108.4 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వేరియంట్‌లో చేసిన మార్పుల కారణంగా సిట్రోయెన్‌ C3 ఎయిర్‌క్రాస్‌ ఆటోమేటిక్‌ బరువు 34 కేజీలు పెరిగింది. ఈ గేర్‌బాక్స్‌ మినహా సెట్రోయెన్‌ C3 ఎయిర్‌క్రాస్‌ ఆటోమేటిక్‌లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదు. దీంతోపాటు ఆటోమేటిక్‌ వేరియంట్‌ను గుర్తించే విధంగా సెట్రోయెన్‌ ఎటువంటి చిహ్నాలు కారుపై ముద్రించలేదు. కారు లోపలి భాగాన్ని పరిశీలించినప్పుడు మాత్రమే ఆటోమేటిక్‌ వేరియంట్‌గా గుర్తించవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu