Ad Code

మెర్సిడెస్‌ బెంజ్‌ GLS ఫేస్‌లిఫ్ట్‌ SUV విడుదల !


బెంజ్‌ GLS ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్లలో ఈ కారును లాంచ్‌ అయింది. పెట్రోల్ వేరియంట్‌ ధర రూ.1.32 కోట్లు (ఎక్స్‌షోరూం) , డీజిల్‌ వేరియంట్‌ ధర రూ.1.37 కోట్లుగా (ఎక్స్‌షోరూం) ఉంది. GLS 2024 మోడల్‌ గతంలో పోలిస్తే గణనీయ రీతిలో డిజైన్‌ మార్పులు చేశారు. పాత మోడల్‌ వాహనం కలిగి ఉన్న 2-స్ట్రిప్‌ డిజైన్‌నకు బదులుగా అప్‌డేట్‌ చేయబడిన గ్రిల్‌ 4 క్రోమ్‌ సమాంతర స్ట్రిప్‌లను కలిగి ఉంటుంది. ఫ్రంట్‌ బంపర్‌ డిజైన్‌ను కూడా మార్చారు. వెనుక టైల్‌ లైట్లు కొత్త బ్లాక్‌ నమూనాను కలిగి ఉన్నాయి. ఈ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ డేటైం రన్నింగ్‌ ల్యాంప్‌లోనూ కొద్దిపాటు మార్పులు చేశారు. మెర్సిడెస్‌ బెంజ్‌ GLS ఫేస్‌లిఫ్ట్‌ 21 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ను కలిగి ఉంది. అబ్సిడియన్‌ బ్లాక్‌, హైటెక్‌ సిల్వర్‌, సోడలైట్‌ బ్లూ, సెలెనైట్‌ గ్రే మరియు పోలార్‌ వైట్‌ వంటి ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది. SUV లోపలి భాగంలో 3 అప్హోల్స్టరీ రంగుల ఆప్షన్‌లను కలిగి ఉంది. బ్లాక్‌, బ్రౌన్‌, లేత గోధుమ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ అన్ని రంగులు అత్యధిక నాణ్యతతో కూడిన ఫాక్స్‌ లెదర్‌తో తయారుచేయబడ్డాయి. దీంతోపాటు హాప్టిక్‌ ఫీడ్‌బ్యాక్‌ బటన్‌తో కూడిన కొత్త స్టీరింగ్‌ వీల్, MBUX ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌లు ఆఫ్‌ రోడ్ డిస్‌ప్లే ఆప్షన్‌లను కలిగి ఉంటుంది. ఈ SUV 5.2 మీటర్ల పొడవు, 1.96 మీటర్ల వెడల్పును కలిగి ఉంటుంది. దీంతోపాటు మెర్సిడెస్‌ బెంజ్‌ GLS ఫేస్‌లిఫ్ట్‌ ఎయిర్‌ సస్పె్న్షన్‌ సెటప్‌ను కలిగి ఉంటుంది. మరియు అదనపు భద్రత కోసం ADAS (అడ్వాన్సడ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్)తో వస్తుంది. ఈ ఎస్‌యూవీ లోపలి భాగం అత్యంత విలాసవంతంగా ఉంటుంది. హీటెడ్‌, కూల్డ్‌ సీట్లు, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ను కలిగి ఉంది. దీంతోపాటు వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణికుల సౌలభ్యం కోసం రియర్‌ సీట్‌ ప్యాకేజీని కలిగి ఉంది. ఈ రియర్‌ సీట్‌ ప్యాకేజీలో ఫ్లస్‌ హెడ్‌ రిస్ట్రేయిన్‌, ఎలక్ట్రిక్‌ సన్‌బ్లైండ్స్‌, సౌకర్యవంతంగా కూర్చొనేందుకు సీట్లను సర్దుబాటు చేసుకొనే అవకాశం ఉంది. ఈ వాహనంలో రెండు 11.6 అంగుళాల ఎంటర్‌టైన్‌మెంట్‌ స్క్రీన్‌లను కలిగి ఉంది. దీంతోపాటు మరో అదనపు ట్యాబ్లెట్‌ కూడా ఉంటుంది. దీని ద్వారా స్క్రీన్‌లు, ఫీ చర్లను కంట్రోల్‌ చేయవచ్చు. మెర్సిడెస్‌ బెంజ్‌ GLS ఫేస్‌లిఫ్ట్‌ 3.0 లీటర్‌ 6 సిలిండర్ పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 381hp శక్తి మరియు 500Nm గరిష్ఠ టార్క్‌ను కలిగి ఉంటుంది. అదేవిధంగా 3.0 లీటర్‌ 6 సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్‌ 367hp శక్తి మరియు 700Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్‌లు మైల్డ్ హైబ్రిడ్‌ సిస్టమ్‌తో ఇంటిగ్రేట్‌ చేయబడి ఉంటాయి. ఇంటిగ్రేటెడ్‌ స్టార్టర్‌ జనరేటర్‌ అదనంగా 20hp శక్తి, 200Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ 9-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది. మరియు ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ టెక్నాలజీతో వస్తుంది.


Post a Comment

0 Comments

Close Menu