Ad Code

శాంసంగ్‌ M, F సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ !


ఫెస్టివల్ సీజన్ సందర్భంగా శాంసంగ్‌ గెలాక్సీ M14, M04, F14, F04 స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్లను శాంసంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌ సహా ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫాంల ద్వారా కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్‌ గెలాక్సీ M14 స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్‌ +128GB స్టోరేజీ ధర రూ.13,490 ఉండగా ప్రస్తుతం రూ.12490 గా ఉంది. అదే విధంగా 6GB ర్యామ్‌ +128GB స్టోరేజీ వేరియంట్ రూ.14,990 ఉండగా ప్రస్తుతం రూ.13,990గా ఉంది. ఈ ఫోన్‌ 50MP ప్రధాన కెమెరాతో సహా ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంది. 6000mAh బ్యాటరీతో రానుంది. 6.6 అంగుళాల LCD పుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. శాంసంగ్‌ గెలాక్సీ F14 స్మార్ట్‌ఫోన్‌ 4GB ర్యామ్ వేరియంట్‌ ధర రూ.14,490 ఉండగా.. ప్రస్తుతం రూ.11990గా ఉంది. అదే 6GB ర్యామ్‌ +128GB స్టోరేజీ వేరియంట్‌ రూ.15,990 ఉండగా.. ప్రస్తుతం రూ.13490గా ఉంది. 6.6 అంగుళాల పుల్‌ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. వెనుకవైపు 50MP+2MP కెమెరాలు, ముందువైపు 13MP కెమెరాలున్నాయి. 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. శాంసంగ్‌ గెలాక్సీ M04 స్మార్ట్‌ఫోన్ ధర రూ.8499గా ఉండగా తగ్గింపు కారణంగా ప్రస్తుతం రూ.7999గా ఉంది. అదే శాంసంగ్‌ గెలాక్సీ F04 స్మార్ట్‌ఫోన్‌ ధర ప్రస్తుతం రూ.7999గా ఉంది. ఈ రెండు హ్యాండ్‌సెట్లు 4GB ర్యామ్‌, 64GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లను అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్‌ ప్లాట్‌ఫాంలో ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై మరింత ఆకర్షణీయమైన తగ్గింపును పొందవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu