Ad Code

10 లక్షల మందిని మార్స్ పైకి తీసుకెళ్లడానికి మస్క్ ప్లాన్లు ?


లోన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఒక పోస్ట్‌పై స్పందిస్తూ,  "మేము ఒక మిలియన్ మందిని అంగారక గ్రహంపైకి తీసుకురావడానికి గేమ్ ప్లాన్‌ను రూపొందిస్తున్నాము." అని పోస్ట్ చేసాడు. భూమి నుండి ఎటువంటి మద్దతు లేకుండా మనుగడ సాగించడానికి అంగారక గ్రహంపై స్థానిక, స్వయం-స్థిరమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడం గురించి కూడా సూచించాడు. "భూమి నుంచి సరఫరా నౌకలు రావడం ఆగిపోయినప్పటికీ అంగారక గ్రహంపై జీవించగలిగినప్పుడు మాత్రమే నాగరికత ఒకే గ్రహం గ్రేట్ ఫిల్టర్‌ను దాటిపోతుంది" అని మస్క్ వ్రాశారు. "స్టార్‌షిప్ ఇప్పటివరకు భూమి పై నిర్మించిన అతిపెద్ద రాకెట్ మరియు ఇది మనల్ని అంగారక గ్రహానికి తీసుకెళ్తుంది" అని ఒక పోస్ట్‌కు ప్రతిస్పందనగా అతను ఇలా చెప్పాడు. భవిష్యత్తు కాలంలో అంగారక గ్రహ యాత్రను ఇప్పుడు మనం మరో దేశానికి విమానంలో వెళ్లినట్లు స్పేస్ యాత్రలు అభివృద్ధి చెందుతాయని మస్క్ అన్నారు. ఎలోన్ మస్క్ , స్పేస్‌ఎక్స్ కంపెనీ వ్యవస్థాపకుడు కూడా, తమ కంపెనీ స్టార్‌షిప్ రాబోయే ఐదేళ్లలో చంద్రునిపైకి వెళ్లగలదని గత వారం ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఈ సమాచారం వచ్చింది. స్పేస్‌ఎక్స్ డ్రాగన్ స్పేస్‌షిప్ మానవులను రాబోయే రోజుల్లో భూమి నుండి అత్యంత ఎక్కువ దూరం తీసుకువెళుతుందని మస్క్ చెప్పారు. వచ్చే ఎనిమిదేళ్లలో స్పేస్‌ఎక్స్ చంద్రుడిపైకి మనుషులను పంపగలదని ఆయన చెప్పారు.

Post a Comment

0 Comments

Close Menu