Ad Code

అంతరిక్షానికి రూ. 13,402 కోట్లు కేటాయింపు


ర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో గురువారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో అంతరిక్ష విభాగానికి ప్రాధాన్యత దక్కింది. 2024-25 సంవత్సరానికి స్పేస్‌కు రూ. 13402 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ. 12,543 కోట్ల కేటాయింపులతో పోలిస్తే దాదాపు రూ. 500 కోట్లు అదనంగా కేటాయించారు. చంద్రయాన్‌-3, ఆదిత్య ఎల్‌1 వంటి హైప్రొఫైల్ మిషన్స్ విజయవంతమైన నేపధ్యంలో స్పేస్‌కు కేటాయింపులను గణనీయంగా పెంచారు. అంతరిక్షానికి తొలి భారతీయుడిని పంపి 2035 నాటికి స్పేస్ స్టేషన్ నెలకొల్పాలన్న ఉద్దేశంతో చేపట్టిన ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మిషన్‌కు ఈ కేటాయింపులు ఊతమిస్తాయని భావిస్తున్నారు. అంతర్జాతీయ సహకరాంతో భారీ మిషన్‌లను చేపట్టే ప్రణాళికలతో ముందుకెళుతున్న ఇస్రో తాజా బడ్జెట్ కేటాయింపులపై సంతృప్తి వ్యక్తం చేయనుంది. ఇక 2024-25 బడ్జెట్‌లో శాస్త్ర సాంకేతిక రంగాలకు రూ. 242 కోట్లు అదనంగా రూ. 16,603 కోట్లు కేటాయించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లోని పలు విభాగాల్లో శాస్త్రీయ పరిశోధన, అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించడంతో ఈ రంగాలకు నిధుల కేటాయింపు పెంచారు.

Post a Comment

0 Comments

Close Menu