Ad Code

14 నెలల్లో 30 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో !


అంతరిక్ష రంగంలో వరుస ప్రయోగాలతో సత్తా చాటేందుకు ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. రానున్న 14 నెలల్లో 30 అంతరిక్ష ప్రయోగాలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. వీటిల్లో ప్రతిష్టాత్మక గగన్ యాన్ ప్రాజెక్టుకు సంబంధించినవి ఏడు ప్రయోగాలు ఉన్నాయి. స్పైరూట్, అగ్నికుల్ వంటి ప్రైవేట్ అంతరిక్ష అంకుర సంస్థల ప్రయోగాలూ ఏడు ఉన్నట్లు ఇన్ స్పేస్ వెల్లడించింది. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీహరికోటలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించేందుకు ప్రణాళికలు చేయబడ్డాయి. వీటిలో సగం భారతదేశంలోని వాణిజ్య అంతరిక్ష రంగానికి ఉపయోగపడనున్నాయి. అంతరిక్ష రంగంలో ప్రస్తుతం భారతదేశం అగ్రదేశాల సరసన చేరింది. అతి తక్కువ బడ్జెట్ తో ప్రతిష్టాత్మక ప్రయోగాలు చేపట్టడమే కాకుండా.. వాటిని విజయవంతంగా తీరాలకు చేర్చుతోంది. ఈ క్రమంలో కొన్నేళ్లుగా రోదసి రంగంలో భారత్ అప్రతిహాత విజయాలతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో 2024-25లో మరిన్ని ప్రయోగాలను నింగిలోకి పంపించేందుకు సిద్ధమైంది. ఇందులో ఇస్రో పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీలలో మూడు టెస్ట్ వెహికిల్స్ తోపాటు గగన్ యాన్ ప్రాజెక్టుకు సంబంధించిన ఏడు ప్రయోగాలు ఉన్నాయి. ఇస్రో యొక్క వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, పీఎస్ఎల్వీకి చెందిన నాలుగు, ఒక ఎల్వీఎం-3 మిషన్, ఎస్ఎస్ఎల్వీకు చెందిన రెండు ప్రయోగాలను నిర్వహించాలని భావిస్తుంది. స్కైరూట్, అగ్నికుల్ వంటి ప్రైవేటు అంతరిక్ష అంకుర సంస్థల ప్రయోగాలూ ఏడు ఉన్నట్లు పేర్కొంది. చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ తన మొదటి 3-డీ ప్రింటెడ్ రాకెట్ అగ్నిబాన్ - సార్టెడ్ ను వచ్చే రెండు నెలల్లో ప్రయోగించనుంది.


Post a Comment

0 Comments

Close Menu