Ad Code

సైబర్, ఆర్థిక మోసాలకు 1.4 లక్షల మొబైల్ నంబర్లు బ్లాక్ !


న్‌లైన్‌లో ప్రజలను మోసం చేయడానికి ఉపయోగించిన 1.4 లక్షల మొబైల్ నంబర్లు, హ్యాండ్‌సెట్లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఈరోజు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషి ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్‌లో సైబర్ సెక్యూరిటీపై సమావేశం జరిగింది. అక్రమాలకు ఉపయోగిస్తున్న ఫోన్ నంబర్లను బ్లాక్ చేయడంతో పాటు, ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన అధికారులు వివిధ అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఫేక్ లేదా నకిలీ పత్రాలపై తీసుకున్న మొబైల్ కనెక్షన్లను గుర్తించేందుకు AI-మెషిన్ లెర్నింగ్ ఆధారిత ఇంజన్ అయిన ASTRను టెలీ కమ్యూనికేషన్ విభాగం అభివృద్ధి చేసింది. బల్క్ SMSలు పంపుతున్న 35 లక్షల ప్రిన్సిపల్ ఎంటిటీలను దీని ద్వారా విశ్లేషించింది. ఇది హానికరమైన SMSలు పంపిన వారిని బ్లాక్ లిస్ట్ చేసింది లేదా డిస్‌కనెక్ట్ చేసింది. ఇప్పటి వరకు 500 కంటే ఎక్కువ అరెస్టులు జరిగాయి. ఏప్రిల్ 2023 నుంచి దాదాపు 3.08 లక్షల సిమ్‌లు, 50,000 IMEIలు, 592 ఫేక్ లింక్‌లు లేదా APKలు, 2,194 URLలను బ్లాక్ చేశారు. ఈ సమావేశానికి వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు, RBI, TRAI, UIDAI, I4C, NPCI, PNB, SBI సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (CFCFRMS) ప్లాట్‌ఫామ్‌లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఎలా ఆన్‌బోర్డ్ చేయాలనే అంశంపై సమావేశంలో మాట్లాడారు. ఈ ప్లాట్‌ఫామ్‌లో API ఇంటిగ్రేషన్ ద్వారా సైబర్ మోసాలను నివేదించవచ్చు. CFCFRMS ప్లాట్‌ఫామ్‌ను నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)తో ఎలా ఇంటిగ్రేట్ చేయాలో కూడా చర్చించారు. ఈ ఇంటిగ్రేషన్‌తో పోలీసు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒకదానికొకటి మెరుగ్గా సహకరించుకోగలవు. తద్వారా సైబర్ మోసాలను ఆపగలవు లేదా నిరోధించగలవు. రియల్-టైమ్‌ మానిటరింగ్ ఫెసిలిటీ కూడా లభిస్తుంది. వాణిజ్య లేదా ప్రచార కార్యకలాపాల కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సాధారణ 10-అంకెల సంఖ్యల వినియోగాన్ని దశలవారీగా తొలగించాలని, TRAI సూచించిన విధంగా '140xxx' వంటి నిర్దిష్ట నంబర్ సిరీస్‌లను మాత్రమే ఉపయోగించాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. నవంబర్‌లో జరిగిన మునుపటి సమావేశంలోని యాక్షన్ పాయింట్లను సమీక్షించారు. సైబర్ భద్రత, డిజిటల్ పేమెంట్ మోసాల సవాళ్లను ఎదుర్కోవడానికి బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఎలా సన్నద్ధమవుతున్నాయో కూడా అంచనా వేశారు. భద్రత, మోసాల నివారణ, భవిష్యత్తు సమస్యలకు సిద్ధంగా ఉండటంపై పురోగతిని విశ్లేషించారు. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడానికి, ఫ్రాడ్-టు-హోల్డ్ నిష్పత్తిని మెరుగుపరచడానికి నిరంతరం వనరులు ఎలా అందుబాటులో ఉంచాలో అధికారులు చర్చించారు. మోసపూరిత ఖాతాల నుంచి బాధితులకు నిధులను తిరిగి ఇవ్వడానికి ఒక కార్యాచరణ ప్రణాళిక లేదా SoPలను ఎలా రూపొందించాలనే దానిపై సమాలోచనలు చేశారు. డిజిటల్ పేమెంట్స్ భద్రతపై ప్రాంతీయ భాషల్లో కస్టమర్ అవగాహన, సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్‌లను నిర్వహించాలని అధికారులు అభిప్రాయపడ్డారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్  విశ్లేషణ సౌలభ్యం కోసం స్టాండర్డ్ ఫార్మాట్‌లో ఆర్థిక సంస్థలు సమాచారాన్ని పంచుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించారు.

Post a Comment

0 Comments

Close Menu