Ad Code

ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ 15పై డిస్కౌంట్ ఆఫర్ !


ఫ్లిప్ కార్ట్ లో నడుస్తున్న వాలంటైన్స్ డే మొబైల్ బొనాంజా సేల్లో ఐఫోన్ 15పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ సేల్ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనుంది. వీటిలో ఏ16 బయోనిక్ చిప్, డైనమిక్ ఐల్యాండ్, 48 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐఫోన్ 15 ధర లాంచ్ అయినప్పుడు మన దేశంలో రూ.79,900 నుంచి ప్రారంభం అయ్యేది. ఇది 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇప్పుడు దీని ధర ఫ్లిప్కార్ట్లో రూ.66,999కు తగ్గింది. హెచ్డీఎఫ్సీ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.64,999కే విడుదల కానుంది. అంటే దాదాపు రూ.15 వేల వరకు తగ్గింపు లభించనుందన్న మాట. 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్లపై కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 15లో 6.1 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లేను కంపెనీ అందించారు. అదనపు ప్రొటెక్షన్ కోసం సెరామిక్ షీల్డ్ మెటీరియల్ కూడా అందుబాటులో ఉంది. గతేడాది ఐఫోన్ 14 ప్రో మోడల్స్లో ఇచ్చిన డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ వీటిలో కూడా ఇచ్చారు. ఏకంగా 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను ఐఫోన్ 15 అందించనుంది. ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఐఫోన్ 15 ప్లస్లో 6.7 అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లేను యాపిల్ అందించింది. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ల్లో వెనకవైపు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అందించారు. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ ట్రూడెప్త్ కెమెరా అందించడం విశేషం. ఏ16 బయోనిక్ చిప్పై ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్ ఫోన్లు పని చేయనుండటం విశేషం. గతేడాది లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ల్లో ఈ ప్రాసెసర్ అందించారు. యూఎస్బీ టైప్-సీతో లాంచ్ అయిన మొదటి యాపిల్ ఐఫోన్ సిరీస్ ఇదే.

Post a Comment

0 Comments

Close Menu