Ad Code

25 శాతం పెరిగిన స్మార్ట్ ఫోన్ సేల్స్ ?


స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 25 శాతం పెరిగాయి. చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ 18 శాతం మార్కెట్ వాటాతో టాప్‌లో నిలిచింది.2022 సెప్టెంబర్ త్రైమాసికం తర్వాత షియోమీ అత్యధిక ఫోన్లు విక్రయించడం ఇదే తొలిసారి. 5జీ ఫోన్లలో చౌక ధరకు అందుబాటులోకి వచ్చిన రెడ్‌మీ 13 సీ ఫోన్‌తో షియోమీ టాప్ లోకి దూసుకొచ్చింది. మరో చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో రెండో స్థానంలో నిలవగా, దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ మూడో స్థానానికి పడిపోయింది. నాలుగు త్రైమాసికాల్లో మొదటి స్థానంలో కొనసాగుతున్నా శాంసంగ్ మూడో స్థానానికి పరిమితం కావడం ఇదే తొలిసారి. ఇక చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు రియల్‌మీ, ఒప్పో నాలుగో, ఐదో స్థానానికి పరిమితం అయ్యాయని మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ పేర్కొంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో మొత్తం ఫోన్ల విక్రయాల్లో 61 శాతం 5జీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. రూ.10,000-25,000 మధ్య ధరకు లభించిన 5జీ స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 24 శాతం. మొత్తం ప్రీమియం స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 51 శాతం. ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్ల ఆవిష్కరణలో ప్రీమియం ఫోన్లలో 17 శాతం విక్రయాలతో మొదటి స్థానంలో నిలిచింది. షియోమీ 18 శాతంతో మొదటి శాతం, 17 శాతంతో వివో, 16.8 శాతంతో శాంసంగ్, 11 శాతంతో రియల్ మీ, 10 శాతంతో ఒప్పో తర్వాతీ స్థానాల్లో నిలిచాయి.

Post a Comment

0 Comments

Close Menu