Ad Code

లావా యువ 3 మొబైల్ విడుదల !


దేశీయ మార్కెట్లో 'లావా మొబైల్స్', తాజాగా యువ సిరీస్ లో మరొక మోడల్ ను ప్రవేశపెట్టింది. లావా యువ3 పేరుతో భారత మార్కెట్లో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మెరుగైన ఫీచర్లు ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను బడ్జెట్ ధరలోనే అందించనున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. మొదటిది 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ కాగా, రెండవది 4GB RAM + 128GB స్టోరేజ్ సామర్థ్యంతో లభిస్తుంది. ఈ రెండింటిలోనూ ర్యామ్ ను 8GB వరకు విస్తరించుకోవచ్చని చెబుతున్నారు. ఈ హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది, భవిష్యత్తులో దీనిని ఆండ్రాయిడ్ 14కు అప్‌గ్రేడ్‌ను హామీ ఇస్తున్నారు. ఎక్లిప్స్ బ్లాక్, కాస్మిక్ లావెండర్ మరియు గెలాక్సీ వైట్ వంటి మూడు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 అంగుళాల HD+ డిస్‌ప్లే, 4GB RAM, 64/128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం, యూనిసోక్ T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్, వెనకవైపు 13MP+2 AI ట్రిపుల్ కెమెరా, ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్‌, ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్, 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఛార్జర్.  కనెక్టివిటీ కోసం డ్యూయల్ సిమ్ స్లాట్, USB టైప్-C పోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. అందిస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu