Ad Code

ఫిబ్రవరిలోనే శాంసంగ్‌ గెలాక్సీ బుక్‌4 సిరీస్‌ విడుదల ?


దేశీయ మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌3 కు తర్వాత తరం ల్యాప్‌టాప్‌గా గెలాక్సీ బుక్‌4 సిరీస్‌ ఈ నెలలోనే  లాంచ్‌ కానుంది. ముందస్తు బుకింగ్‌లు ఈనెల మధ్యలో నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెలాఖరు నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌ గెలాక్సీ బుక్‌4 అల్ట్రా, బుక్‌4 ప్రో మరియు బుక్‌4 ప్రో 360 ల్యాప్‌టాప్‌లున్నాయి. అల్ట్రా మోడల్‌ మినహా మిగిలిన రెండు మోడళ్లు ఈ నెలాఖరు నుంచి సేల్‌లోకి రానున్నాయి. బుక్‌4 అల్ట్రా మోడల్‌ ఇంటెల్‌ కోర్‌ 9, ప్రో మోడల్‌ కోర్‌ అల్ట్రా 7 CPU మరియు న్యూట్రల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ తోపాటు ఇంటెల్‌ తొలి AI పీసీ యాక్సిలిరేషన్‌. దీంతోపాటు అల్ట్రా మోడల్‌ NVIDIA GeForce RTX 4070 8GB GDDR6 GPU ను కలిగి ఉంటుంది. శాంసంగ్‌ గెలాక్సీ బుక్‌4 అల్ట్రా మోడల్‌ NVIDIA GeForce RTX 4070 GPU మోడల్ RTX ఆప్టిమైజ్‌డ్‌ స్టాబల్‌ డిఫ్యూజన్‌ ద్వారా ఇమేజ్‌ జనరేషన్‌ సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి. మరియు ఈ డివైస్‌ డైనమిక్ అమోలెడ్‌ 2X టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. మరియు 400 నిట్స్‌ బ్రైట్‌నెస్‌, 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ ల్యాప్‌ డాల్బీ అట్మాస్‌ AKG- క్వాడ్‌ స్వీకర్లను కలిగి ఉంటుంది.  కనెక్టివిటీ పరంగా కీలక ఫీచర్లు: ఈ సిరీస్‌ ల్యాప్‌టాప్‌లు విండో 11 హోమ్‌ ను కలిగి ఉంటుంది. ఈ మోడల్‌లు వైఫై 6E, బ్లూటూత్‌ 5.3, 2 థండర్‌బోల్ట్‌ 4 ( 2 ), USB-A, HDMA 2.1 పోర్టు, మైక్రో SD, మరియు హెడ్‌ఫోన్ జాక్‌ను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌లు 2MP FHD ( పుల్‌ HD ) కెమెరా మరియు AI ( ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ) డ్యూయల్‌ మైక్‌ను కలిగి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu