Ad Code

రియలన్స్‌ జియో నుంచి 5జీ ఫోన్‌ ?


రియలన్స్‌ జియో ఇప్పటికే అత్యంత తక్కువ ధరకే 4జీ ఫోన్‌ను తీసుకొచ్చిన అందరి దృష్టిని ఆకర్షించిన. తాజాగా 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. రూ. 10 వేలలోనే 5జీ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు రియలన్స్‌ సన్నాహాలు చేస్తోంది. తర్వలోనే ఈ ఫోన్‌ మార్కెట్లోకి రానుంది. రిలయన్స్ జియోతో కలిసి క్వాల్‌కామ్ చిప్‌సెట్ కంపెనీ ఈ కొత్త జియో 5జీ ఫోన్ అభివృద్ధి చేస్తోంది. దేశంలో 5జీ నెట్‌వర్క్‌ని విస్తృతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న రియలన్స్‌ ఈ దిశగా అడుగులు వేస్తోంది. క్వాల్‌కామ్ లేటెస్ట్ చిప్‌సెట్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్ సరసమైన ధరకే ఫుల్ 5జీ ఎక్స్‌పీరియన్స్ అందించగలదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విషయమై క్వాల్‌కామ్ ఎస్‌వీపీ, హ్యాండ్ సెట్స్ జనరల్ మేనేజర్ క్రిస్ పాట్రిక్ మాట్లాడుతూ.. సరసమైన ధరల్లో స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వినియోగదారులకు పూర్తి 5జి అనుభవాన్ని ఇవ్వాలని చూస్తున్నామని, మేము 4 జీ నుంచి 5 జీ మార్పుపై చాలా ఎక్కువగా దృష్టిపెడుతున్నామని తెలిపారు. 4జీ, 5జీ మధ్య మార్పుపై దృష్టి పెడుతున్నామని ఆయన చెప్పారు. భారత మార్కెట్లోని మిలియన్ల మంది 2జీ వినియోగదారులను నేరుగా 5జీ ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్‌లకు అందించడానికి కొత్త చిప్‌సెట్ సాయపడుతుందని అభిప్రాయపడుతున్నారు. తమ నిర్ణయంతో భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా 280 కోట్ల మంది ప్రజలకు 5జీ సేవలు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జియో, క్వాల్ కామ్ చెబుతున్నాయి.


Post a Comment

0 Comments

Close Menu