Ad Code

త్వరలో వోడాఫోన్ ఐడియా 5G సర్వీసులు ?


దేశీయ మార్కెట్లోకి వోడాఫోన్ ఐడియా (Vi) 5జీ సర్వీసులను రాబోయే 6 నుంచి 7 నెలల్లో ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. టెలికాం ల్యాండ్‌స్కేప్‌లో ఇతర కంపెనీ దిగ్గజాలకు పోటీగా తీసుకొస్తోంది. ఇప్పటికే రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ఇప్పటికే దేశవ్యాప్తంగా తమ 5జీ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వోడాఫోన్ ఐడియా ఎట్టకేలకు భారత్‌లో 5జీ సర్వీసులను లాంచ్ చేయనున్నట్టు ధృవీకరించింది. 5జీ సర్వీసులను ప్రారంభించే దిశగా వోడాఫోన్ ఐడియా అడుగులు వేస్తోందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, అక్షయ మూండ్రా పేర్కొన్నారు. వోడాఫోన్ ఐడియా 5జీ ప్లాన్‌ల గురించి నిర్దిష్ట వివరాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఎందుకంటే.. కొనసాగుతున్న నిధుల సేకరణ కార్యక్రమాలను పూర్తి చేయడంపై ఆధారపడి ఉంటుంది. దేశంలో 5జీ ప్రారంభించేందుకు తన వ్యూహాన్ని ఖరారు చేయడానికి కంపెనీ టెక్నాలజీ భాగస్వాములతో చర్చలు జరుపుతోందని ఆయన వెల్లడించారు. మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ముంబై, కోల్‌కతా వంటి కీలక ప్రాంతాలలో 3జీ సర్వీసులను నిలిపివేయడంతో పాటు వోడాఫోన్ ఐడియా సర్వీసులను క్రమబద్ధీకరించడానికి వ్యూహాత్మక చర్యలను చేపట్టింది. అలాగే, 2025 ఆర్థిక సంవత్సరం నాటికి 3జీ నెట్‌వర్క్‌ను పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసే ప్రణాళికలను రచిస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu