Ad Code

ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ తో పీఎఫ్ బ్యాలెన్స్ ?


ఇంటర్నెట్ అవసరం లేకుండానే కేవలం టెక్స్ట్ మెస్సేజ్‌ తో ఈజీగా మీ పిఎఫ్ బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవచ్చు.  రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి EPFOHO అని టైప్ చేసి మీ యూఏఎన్ నెంబర్ నమోదు చేసి 7738299899 నెంబర్‌కు మెస్సేజ్ చేస్తే చాలు వెంటనే మీ బ్యాలెన్స్ ఎంతో ఎస్ఎంఎస్ వచ్చేస్తుంది. అదేవిధంగా ఎస్ఎంఎస్ ద్వారా రాకపోతే మిస్డ్ కాల్ ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. 9966044425 నెంబర్‌కు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి మిస్డ్ కాల్ ఇస్తే చాలు మీ బ్యాలెన్స్ ఎంత ఉందో క్షణాల్లో తెలిసిపోతుంది. మీ పీఎఫ్ బ్యాలెన్స్‌పై ప్రభుత్వం ఎప్పటికప్పుడు డిపాజిట్ చేసే వడ్డీ డబ్బులతో పీఎఫ్ బ్యాలెన్స్ పెరుగుతుంటుంది. అయితే ఇంతకుముందు పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఈపీఎఫ్ఓ వెబ్‌సైట్ ఓపెన్ చేసి వివరాలు ఎంటర్ చేసి తెలుసుకోవల్సి వచ్చేది. అలా చేయడం వల్ల సమయం ఎక్కువ పట్టడమే కాకుండా ఇంటర్నెట్ డేటా అవసరమయ్యేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అందుకోసం పైన చెప్పిన విధంగా చేస్తే చాలు.

Post a Comment

0 Comments

Close Menu