Ad Code

టాటా మోటార్స్‌ నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లు !


భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2024లో టాటా మోటార్స్.. తన కొత్త టాటా హారియర్ EV ని ప్రదర్శించింది. Acti.ev ఆర్కిటెక్చర్‌పై సంస్థ ఈ కారును నిర్మిస్తోంది. కాగా త్వరలోనే టాటా హారియర్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని సంస్థ విడుదల చేయనుంది.  టాటా మోటార్స్‌ నుంచి మరో ఎలక్ట్రిక్‌ కారు టాటా హారియర్‌ ఈవీ త్వరలో విడుదల కాబోతుంది. ఇప్పటికే ఎలక్ట్రిక్‌ కార్ల సెగ్మెంట్‌లో నాలుగు కార్లను విడుదల చేసిన సంస్థ.. మరికొన్ని నెలల్లో మరో కారును విడుదల చేయనుంది. ఈ క్యాలెండర్‌ ఇయర్‌ చివర్లో దీనిని టాటా మోటార్స్‌ లాంచ్‌ చేయనున్నట్లు సమాచారం. 2024 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో షోలో టాటా ప్రొడక్షన్‌- స్పెక్‌ Curvv తో పాటు హారియర్‌ EV ని కూడా సంస్థ ప్రదర్శించింది. టాటా హారియర్‌ ఈవీ ఫుల్‌ ఛార్జింగ్‌పై 500 కి. మీ రేంజ్‌తో విడుదల కానుంది. దీంతో అత్యధిక రేంజ్‌ ఇచ్చే బ్రాండ్‌ ఫ్లాగ్‌షిప్‌ SUV లలో టాటా హారియర్‌ ఈవీ అగ్రస్థానంలో ఉండనుంది. అంతే కాకుండా ఇది వెహికల్-టు-లోడ్ మరియు వెహికల్-టు-వెహికల్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. టాటా హారియర్‌ ఈవీ డిజైన్‌, ఇంటీరియర్‌ పరంగా అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది. బ్యూటిఫుల్‌ బాడీ వర్క్‌తో పాటు ప్రకాశవంతమైన లోగో, ఎక్స్‌టీరియర్‌ పరంగా విస్తృత LED డేటైమ్ రన్నింగ్ లైట్లు ఫంక్షనల్ మరియు ఎమోటివ్ లైటింగ్‌తో పాటు ఏరోడైనమిక్‌ సెరేటెడ్ టర్బైన్ బ్లేడ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లేయర్డ్ డ్యాష్‌బోర్డ్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి టాప్‌ రేంజ్‌ ఫీచర్లతో రానుంది. ఇంకా ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్, టచ్-ఆధారిత కంట్రోలింగ్‌తో పాటు సేఫ్టీ పరంగా మల్టీ ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ADAS సిస్టమ్ ఇంకా అధునాతన ఫీచర్లతో వస్తుంది. ధర విషయానికొస్తే రూ. 25 లక్షలు కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu