Ad Code

కంటెంట్ క్రియేటర్లకు నేషనల్ క్రియేటర్ అవార్డులు !


న్యూ ఏజ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు, క్రియేటర్లను గుర్తించేందుకు భారత ప్రభుత్వం ''నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్''ను ప్రకటించనుంది. ఈ అవార్డులను జెన్ Z వాళ్లకు అందించనున్నారు. 1990వ దశకం చివరి నుంచి 2010 తొలినాళ్ళ మధ్య కాలంలో పుట్టిన వాళ్ళను 'జెన్ Z' అని పిలుస్తారు. ''జెన్ Z" కోసం ఇలాంటి అవార్డులను ప్రకటించడం ఇదే తొలిసారి. ఇంటర్నెట్, సోషల్ మీడియాకు అలవాటు పడిన యువ తరానికి ఈ అవార్డు ఒక గుర్తింపుగా నిలువనుంది. మొత్తం 20 విభాగాల్లో ''నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్''ను ప్రదానం చేస్తారని సమాచారం. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా ఈ అవార్డుల కోసం పోటీలో ఉంటారు.దేశం యొక్క సాఫ్ట్ పవర్, సంస్కృతిని అంతర్జాతీయంగా వ్యాప్తి చేయడంలో సహాయపడే వారికి కూడా ఒక కేటగిరి ఉన్నట్లు తెలుస్తోంది. ''గ్రీన్ ఛాంపియన్స్'', '' స్వచ్ఛతా అంబాసిడర్స్'', ''ఆగ్రో క్రియేటర్స్'', ''టెక్ క్రియేటర్స్'' వంటి అవార్డు కేటగిరీలు సైతం ఉండే ఛాన్స్ ఉంది. వివిధ భాషల సినిమాలను గుర్తించే జాతీయ చలనచిత్ర అవార్డుల తరహాలోనే ఈ అవార్డులు ఉంటాయని తెలుస్తోంది. కాగా, 1980 ప్రారంభ కాలం నుంచి 1990 చివరి వరకు పుట్టిన వారిని మిలీనియల్స్‌గా లేదా జనరేషన్ వై అని పిలుస్తుంటారు. వీరి వయసు 25 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉంటుంది. కంటెంట్ క్రియేటర్లకు ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ గుడ్ న్యూస్ చెప్పింది. మానిటైజేషన్‌కు అర్హత సాధించేందుకు ఉన్న సబ్‌స్క్రైబర్ల సంఖ్యను సగానికి తగ్గించింది. యూట్యూబ్ పార్ట్నర్ పోగ్రామ్ నిబంధనలను సవరించింది. తక్కువ సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు ఉన్న కంటెంట్ క్రియేటర్లు కూడా డబ్బులు సంపాదించేందుకు నిబంధనలను మార్చింది. గతంలో యూట్యూబ్ మానిటైజేషన్ అర్హత సాధించాంటంటే కనీసం 1000 మంది సబ్‌స్క్రైబర్లు ఉండటంతో పాటు ఏడాదిలో కనీసం 4000 గంటల వ్యూస్ ఉండాలి, లేదా 90 రోజుల్లో 10 మిలియన్ షార్ట్స్ వీడియో వ్యూస్ ఉండాలి.అయితే కొత్తగా తీసుకువచ్చిన మానిటైజేషన్ నిబంధనల ప్రకారం.. ఇకపై 500 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నా సరిపోతుంది. చివరి 90 రోజుల్లో కనీసం మూడు లేదా అంతకన్నా ఎక్కువ పబ్లిక్ వీడియోలను అప్లోడ్ చేసి ఉండాలి, ఏడాదిలో 3000 గంటల వ్యూస్ లేదంటే చివరి 90 రోజుల్లో 3 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ఉండాలి. ఈ కనీస అర్హతలు సాధించిన కంటెంట్ క్రియేటర్లు ఇకపై యూట్యబ్ మానిటైజేషన్ ప్రోగ్రామ్ కి అప్లయ్ చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu