Ad Code

జియో ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం డేటా బూస్టర్ ప్లాన్లు !


యిర్ ఫైబర్ కస్టమర్ల కోసం రిలయన్స్ జియో కొత్తగా రెండు ప్లాన్లు ప్రకటించింది. యూజర్లు అదనపు డేటా వినియోగించుకోవడానికి వీలుగా 'డేటా బూస్టర్ ప్లాన్స్' అనే పేరుతో రూ.101, రూ.251 టారిఫ్ లతో ఈ ప్లాన్లు తెచ్చింది. గతంలో డేటా బూస్టర్ కోసం రూ.401 టారిఫ్‌తో ప్లాన్ ప్రకటించింది. దీపావళి నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన జియో ఎయిర్ ఫైబర్ సేవలు సుమారు 500 పట్టణాల్లో లభిస్తున్నాయి. 5జీ ఆధారిత వైర్ లెస్ ఎయిర్ ఫైబర్ కోసం రెగ్యులర్, మ్యాక్స్ పేరుతో జియో ఆరు బేసిక్ ప్లాన్లు అందిస్తున్నది. గరిష్టంగా ఒక టిగా బైట్ వరకూ డేటా లభిస్తుంది. డేటా పూర్తయితే దాని స్పీడ్ 64 కేబీపీఎస్ కు పడిపోతే డేటా బూస్టర్ ప్లాన్ అవసరం అవుతుంది. రిలయన్స్ జియో తెచ్చిన రూ.101 టారిఫ్ డేటా బూస్టర్ ప్లాన్‌తో 100 జీబీ డేటా పొంగదొచ్చు. రూ.251 విలువైన టారిఫ్ ప్యాక్ మీద 500 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్లకు ప్రత్యేక గడువేమీ లేదు. బేస్ ప్లాన్ల గడువుకూ ఇది వర్తిస్తుంది. ఇక డేటా బూస్టర్ ప్లాన్ టారిఫ్ ను బట్టి జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. రెగ్యులర్‌గా రూ.589, రూ.899, రూ.1,199, మ్యాక్స్ ప్లాన్ల కింద రూ.1,499, రూ.2,499, రూ.3999 టారిఫ్ ప్యాక్ లతో డేటా ప్లాన్లు అమలవుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu