Ad Code

సీఎన్జీ, ఐసీఎన్జీ కార్ల మధ్య తేడా ?


పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజులు ఆకాశాన్ని అంటుతుండడంతో సీఎన్జీ కార్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. కంపెనీలు తమ కార్లలో సీఎన్జీ వేరియంట్ ను తీసుకురావడానికి కూడా ఇదే కారణం. ఈ క్రమంలో ఇటీవల ఐసీఎన్జీ కార్లు కూడా వేగంగా అభివృద్ది చెందుతున్నాయి. సీఎన్జీ కార్లతో పాటు మార్కెట్ లో ఐసీఎన్జీ కార్లు కూడా కనిపిస్తున్నాయి. దీంతో వినియోగదారుల్లో కన్ ఫ్యూజన్ మొదలైంది. సీఎన్జీ కారు కొనలా? ఐసీఎన్జీ కారు కొనాలా అనే అయోమయంలో పడిపోయారు. సీఎన్జీ కారు ఇంజిన్ పెట్రోల్, సీఎన్జీ రెండింటితో నడుస్తుంది. ఐసీఎన్జీ కార్ల లో ఇంజిన్ తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఫిక్స్ చేసి ఉంటుంది. ఇది కారుకు ఎక్స్ ట్రా పవర్ ను ఇస్తుంది. దాంతో కారు పవర్, మైలేజీ కూడా పెరుగుతుంది. ఐసీఎన్జీ కార్లు సీఎన్జీ కార్లకంటే 12 నుంచి 15 శాతం ఎక్కువ మైలేజీని ఇస్తాయి. ఒక సీఎన్జీ కారు ఒక కిలో సీఎన్జీకి 20 కిలోమీటర్ల మైలేజీని ఇస్తే, ఐసీఎన్జీ కారు 22-23 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. దీనికారణంగా సాధారణ సీఎన్జీ కార్లతో పోల్చితే ఐసీఎన్జీ కార్లు పొల్యూషన్ ఫ్రీ. అయితే ఐసీఎన్జీ కార్ల ధర ఎక్కువే. కానీ ఐసీఎన్జీ కార్లను నడపడానికి అయ్యే ఖర్చు సీఎన్జీ కార్లతో పోల్చితే చాలా తక్కువ.

Post a Comment

0 Comments

Close Menu