Ad Code

త్వరలో ఫోన్‌ నంబర్‌ను వినియోగించడం ఆపేస్తా !


లాన్‌ మస్క్‌ తాజాగా చేసిన పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. తాను త్వరలో ఫోన్‌ నంబర్‌ను వినియోగించడం నిలిపేస్తానని తెలిపారు. మెసేజ్‌, ఆడియో, వీడియో కాల్స్‌ కోసం X ను మాత్రమే వినియోగిస్తానని స్పష్టం చేశారు. గత అక్టోబర్‌లో X ద్వారా ఆడియో, వీడియో కాల్స్‌ చేసుకొనే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫోన్‌ నంబర్‌ లేకుండానే ఈ ఫీచర్‌ ద్వారా కాల్స్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, మ్యాక్‌, పీసీలు ఈ కాలింగ్‌ ఫీచర్‌ సపోర్టు చేస్తాయి. ఈ ఫీచర్‌ను ప్రమోట్‌ చేయడంలో భాగంగా ఎలాన్‌ మస్క్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 'మరికొన్ని నెలల్లో నా ఫోన్‌ నంబర్‌ను నిలిపివేస్తా. మెసేజ్‌, ఆడియో, వీడియో కాల్స్‌ కోసం కేవలం X ను మాత్రమే ఉపయోగిస్తా.' అని ఎలాన్‌ మస్క్‌ పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం X వెబ్‌సైట్‌ ప్రకారం ఈ కాలింగ్‌ ఫీచర్‌ నుంచి ప్రీమియం సబ్‌స్కైబర్‌లు మాత్రమే ఆడియో/ వీడియో కాల్స్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇతర సాధారణ ఖాతాలు కలిగిన వారు ఇతరులకు కాల్‌ చేయలేరు, కేవలం కాల్స్‌ను స్వీకరించగలరు. అయితే ఈ కాల్స్‌కు మెరుగైన భద్రతను కలిగి ఉంటాయని తెలుస్తోంది. X ప్లాట్‌ఫాంలో ఆడియా మరియు వీడియో కాల్‌ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసేందుకు సంబంధించిన ఓ స్క్రీన్‌షాట్‌ను గతంలోనే ట్విట్టర్‌ సీఈవో లిండా షేర్‌ చేశారు. ఇందులో ఎవరు తమకు వీడియో కాల్‌ చేయవచ్చునో ఎంపిక చేసుకోవచ్చు. అక్కడ మూడు ఆప్షన్లు కనిపిస్తాయి. వెరిఫైడ్‌ యూజర్లు, ఫాలో అవుతున్న ఖాతాలు, అడ్రస్‌ బుక్‌లో ఉన్న ఖాతాలు.. వంటి ఆప్షన్లు ఉన్నాయి. అందులో మీకు నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఈ ఆప్షన్‌ మీకు కనిపించకుంటే ముందుగా X (ట్విట్టర్‌) యాప్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. తర్వాత ప్రైవసీ మరియు సెక్యూరిటీ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. అనంతరం డైరెక్ట్‌ మెసేజ్‌ ఆప్షన్‌ను ట్యాప్‌ చేయాలి. చివరికి అక్కడ కనిపించిన ఆడియో మరియు వీడియో కాలింగ్‌ ఫీచర్‌ను ఎంచుకోవాలి. అక్కడ కుడివైపున ఫోన్ సింబల్‌ను గుర్తించవచ్చు. ఈనెల తొలిరోజుల్లో X లో కొత్త సబ్‌స్క్రిప్షన్‌ మోడల్‌ను తీసుకొస్తామని తెలిపింది. బేసిక్ ఫీచర్ల కోసం సంవత్సరానికి $1 (భారత కరెన్సీలో 83 రూపాయలు) చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. దీనిపై ఎలాన్ మస్క్‌ గతంలోనే స్పందించారు. ఉచితంగా చదవండి. కానీ రాసేందుకు $1/ సంవత్సరం చెల్లించాల్సి ఉంటుందని రాసుకొచ్చారు. బాట్లతో పోరాడేందుకు ఇదో మంచి మార్గమని భావిస్తున్నట్లు చెప్పారు. బాట్లను పూర్తిగా నియంత్రించడం సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu