Ad Code

గూగుల్‌ బాట్‌ బార్డ్ జెమినిగా మార్పు !


గూగుల్‌ ఇటీవల తన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ బాట్‌ బార్డ్ ను జెమినిగా మార్చింది. దాంతోపాటు AI చాట్‌బాట్‌ అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ను జెమిని అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ను లాంచ్‌ చేసింది. అయితే ఈ ప్రో వెర్షన్‌ ఇంకా గూగుల్ సంస్థ బార్డ్‌ అడ్వాన్స్‌డ్ గానే పిలుస్తోంది. జెమిని అనేది అత్యంత సమర్థవంతమైన మరియు సురక్షితమైన AI మోడల్‌ను రూపొందిస్తున్నామని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌  వెల్లడించారు. బార్డ్‌ అనేది ప్రజలు నేరుగా వినియోగదారులతో పరస్పరంగా చర్చించే ప్రత్యక్ష మార్గంగా ఉందని, కాబట్టి జెమినిగా మార్చినట్లు చెప్పారు. ప్రస్తుతం మేం మోడల్‌ను అభివృద్ధి చేసే మార్గంగా కూడా ఉంటుందని తాము భావిస్తున్నాం. వినియోగదారుల నేరుగా పరస్పరం చర్య జరపవచ్చ. కాబట్టి పేరు మార్పు అర్ధవంతంగా ఉందని మేం భావిస్తున్నామన్నారు. గూగుల్‌ కొత్త జెమిని లార్జ్ లాంగ్వేజ్‌ మోడల్‌ జెమిని చాట్‌బాట్‌ మూడు వెర్షన్‌లో అందుబాటులో ఉంటుంది.

జెమిని నానో : ఇది జెమిని చిన్న లాంగ్వేజ్‌ మోడల్‌గా ఉంది. దీని స్మార్ట్‌ఫోన్‌లలో వినియోగించుకోవచ్చు.

జెమినీ ప్రో : ఇది జెమిని AI చాట్‌బాట్‌ ఉచిత వెర్షన్‌గా ఉంది. మరియు లార్జ్‌, అధిక సామర్థ్యం కలిగిన మోడల్‌గా ఉంది.

జెమిని అల్ట్రా : ఇది గూగుల్‌ బార్డ్‌ అధిక శక్తివంతమైన లాంగ్వేజ్‌ మోడల్‌గా ఉంది. ఇది జెమిని అడ్వాన్స్‌డ్‌ AI చాట్‌బాట్‌గా ఉంది. ప్రస్తుతానికి గూగుల్‌ అడ్వాన్స్‌డ్‌ మోడల్‌కు అల్ట్రా 1.0 యాక్సెస్‌ను కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు గూగుల్‌ అధిక సామర్థ్యం కలిగిన మోడల్‌గా ఉంది. గూగుల్‌ జెమిని త్వరలో ఆండ్రాయిడ్‌, iOS ఫోన్లలో యాప్‌ల రూపంలో అందుబాటులోకి వస్తుందన్నారు. ఇతర సంస్థల ఏఐ బాట్‌లతో పోలిస్తే గూగుల్‌ జెమిని భిన్నమైనదని సీఈవో సుందర్‌ పిచాయ్‌ వెల్లడించారు. కేవలం టెక్స్ట్‌ మాత్రమే కాకుండా ఫోటోలు, ఆడియో, వీడియో, కోడ్‌ అన్ని విధాల ఫార్మాట్‌లలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. గూగుల్‌ జెమినికి వాయిస్‌, ఫోటో, టెస్ట్స్‌ రూపంలో ఇన్‌పుట్‌ ఇచ్చినా వెంటనే స్పందిస్తుందన్నారు.


Post a Comment

0 Comments

Close Menu