Ad Code

ఏఐ నియంత్రణ వ్యవస్ధపై త్వరలో ముసాయిదా విడుదల !


ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నియంత్రణకు దీటైన వ్యవస్ధపై ప్రభుత్వం కసరత్తు సాగిస్తోందని, ఈ ఏడాది జూన్‌, జులై నాటికి ఇది సిద్ధమవుతుందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఆర్ధిక వృద్ధి లక్ష్యాలను అధిగమించేందుకు ప్రభుత్వం ఏఐ సేవలను వినియోగించుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, రైతు ఉత్పతుల మెరుగుదల వంటి రంగాల్లో ఏఐ ప్రభావం అధికంగా ఉంటుందని మంత్రి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఏఐ నియంత్రణపై ప్రభుత్వం గత కొంతకాలంగా కసరత్తు సాగిస్తోంది. ఏఐ రెగ్యులేషన్ వ్యవస్ధ ముసాయిదాను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నా ముసాయిదా విడుదలలో జాప్యం చోటుచేసుకుంటోంది. కేంద్ర మంత్రి సైతం పలు సందర్భాల్లో ఏఐ నియంత్రణ, దాని ప్రాధాన్యతల గురించి వివరించారు. ఇక ముంబై టెక్ వీక్‌లో మంత్రి మాట్లాడుతూ ఏఐ సత్తా, సామర్ధ్యం గురించి వివరాలు వెల్లడవుతున్నా దీని ద్వారా తలెత్తే ముప్పు, హాని గురించి కూడా హాట్ డిబేట్ సాగుతోందని అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu