Ad Code

ఆపిల్‌ నుంచి ఫోల్డబుల్‌ ఐఫోన్లు ?


పిల్‌ తొలి మిక్సడ్‌ రియాలిటీ హెడ్‌సెట్‌ విజన్‌ ప్రో ఇటీవల అమెరికాలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఆపిల్‌ సంస్థ ఫోల్డబుల్‌ ఐఫోన్‌ను తయారు చేయనుందనే వార్తలు వస్తున్నాయి. రెండు ప్రోటోటైప్‌ ఫోన్లను అభివృద్ధి చేస్తు్న్నట్లు తెలుస్తోంది. ఈ ఫోల్డబుల్‌ ఐఫోన్లు గెలాక్సీ Z Flip 5 స్మార్ట్‌ఫోన్‌కు పోటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఫోల్డబుల్‌ ఐఫోన్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయనే వివరాలు వెల్లడి కాలేదు. ప్రోటోటైప్‌ డిజైన్‌ పై సంస్థ సంతృప్తి చెందాకా ఉత్పత్తి ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది. కొన్ని నివేదికల ఆధారంగా ఆపిల్ సంస్థ రెండు క్లామ్‌షెల్ మోడల్‌ ఫోల్డబుల్‌ ఐఫోన్‌ మోడల్‌ ప్రోటోటైప్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్‌ గెలాక్సీ Z Flip తరహా డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. సమాంతరంగా మడతపెట్టే విధంగా ఉంటుంది. ఈ ఫోన్లు ప్రస్తుతానికి ప్రోటోటైప్‌ మోడళ్లుగానే ఉంటాయని తెలుస్తోంది. ఐఫోన్‌ ఫోల్డబుల్‌ డివైస్‌లకు అవుటర్‌ డిస్‌ప్లే కలిగి ఉండాలని, ఫోల్డింగ్‌ చేసినప్పుడు కనిపించేలా ఉండాలని ఆపిల్‌ తన ఇంజినీర్లకు నిర్దేశించినట్లు తెలుస్తోంది. అయితే ఈ డిజైన్‌ త్వరగా బ్రేక్‌ అయ్యే ఛాన్స్‌ ఉందని చెప్పినట్లు తెలిసింది. అయితే ప్రస్తుత ఐఫోన్ల మాదిరిగా సన్నగా ఉండేలా డిజైన్‌ను రూపొందించాలని భావిస్తున్నట్లు సమాచారం.

Post a Comment

0 Comments

Close Menu