దేశీయ మార్కెట్లోకి మిత్సుబిషి మళ్లీ ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. అన్ని అనుకూలిస్తే ఈ సంవత్సరం వేసవిలో కంపెనీ తన కార్ల అమ్మకాలను కూడా ప్రారంభించవచ్చు. మిత్సుబిషి పెట్టుబడి $33 మిలియన్, $66 మిలియన్ల మధ్య ఉంటుందని అంచనా వేసింది. నియంత్రణ ఆమోదం పెండింగ్‌లో ఉంది. వ్యాపారాన్ని పునఃప్రారంభించేందుకు మిత్సుబిషి TVS మొబిలిటీతో చేతులు కలిపింది. రాయిటర్స్ ప్రకారం, TVS మొబిలిటీలో జపాన్ కార్ కంపెనీ మిత్సుబిషి 32 శాతం వాటాను కొనుగోలు చేసింది. టీవీఎస్‌తో కలిసి కంపెనీ దేశవ్యాప్తంగా డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను ప్రారంభించనుంది. TVS మోటార్స్ ఇప్పటికే హోండా కార్స్ ఇండియా డీలర్‌షిప్‌ను నిర్వహిస్తోంది. కార్ల అమ్మకాల పరంగా భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది.
0 Comments