Ad Code

రాత్రిపూట ల్యాప్టాప్ వినియోగం - జాగ్రత్తలు !


రాత్రిపూట ల్యాప్టాప్ని ఉపయోగించాలని భావిస్తే స్క్రీన్ నుంచి వెలువడే కాంతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలాముఖ్యం. ల్యాప్టాప్లోని డిస్ప్లే సెట్టింగులతో రాత్రి సమయాల్లో ఈ కాంతిని నియంత్రివచ్చు. ల్యాప్టాప్ స్క్రీన్ కోసం బ్లూ లైట్కు బదులుగా వెచ్చని కాంతి (ఎల్లో కాంతిని) ఎంచుకోవచ్చు. ఈ కాంతిలో డిస్ప్లేను చూడటం వల్ల మీ కళ్లకు ఎలాంటి సమస్య రాదు. వాస్తవానికి ల్యాప్టాప్ డిస్ప్లే సెట్టింగ్లలో ఉండే ఈ వెచ్చని కాంతిని పసుపు కాంతి అంటారు. మీరు డిస్ ప్లే సెట్టింగులను మార్చినప్పుడు ల్యాప్ టాప్ స్క్రీన్ నీలం రంగు నుంచి పసుపు రంగులోకి మారుతుంది. మీరు అద్దాలు లేకుండా చేస్తూ ఈ తేడాను గమనించవచ్చు. ఈ కాంతితో మీ కళ్లు విశ్రాంతి పొందుతాయి. హాయిగా నిద్రపడుతుంది. ల్యాప్టాప్ విండోస్ 11 లో నైట్లైట్ ని ఆన్ చేయాలి. ల్యాప్టాప్ హోమ్ స్క్రేన్ పై మౌస్ కుడిబటన్ క్లిక్ చేయాలి. మెను నుంచి డిస్ప్లే సెట్టింగులను నొక్కాలి. బ్రైట్నెస్ కింద నైట్ లైట్ పై ట్యాప్ చేయాలి. నైట్లైట్ టోగుల్ ఆన్ చేయాలి. మీ షెడ్యూల్ ప్రకారం రాత్రి పూట ఉపయోగించే కాంతికోసం టైం సెట్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీరు ప్రతిసారీ నైట్ లైట్ ఆన్ చేయాల్సిన అవసరం ఉండదు . 

Post a Comment

0 Comments

Close Menu