Ad Code

నోకియా 3210ని రీ లాంచ్‌ చేయనున్న హెచ్ఎండీ ?


నోకియా పాపులర్‌ ఫీచర్‌ ఫోన్ విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా X లో ఆసక్తికర పోస్ట్‌ చేసింది. నోకియా 3210  ఫీచర్‌ ఫోన్‌ను మళ్లీ విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు హెచ్ఎండీ సంస్థ తెలిపింది. అయితే చిన్న డిజైన్‌, హార్డ్‌వేర్‌ మార్పులు కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఈ నోకియో ఫీచర్‌ ఫోన్ కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఈ నోకియా 3210 ఫీచర్‌ ఫోన్‌ 1999లో తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది. ఈ మార్చి 18 నాటికి 25 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగానే ఈ హ్యాండ్‌సెట్‌ను రీ లాంచ్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ నోకియా ఫోన్ అనేక రంగుల్లో లభించనుందని తెలుస్తోంది. వైబ్రంట్‌ యెల్లో కలర్‌ వేరియంట్‌ కూడా అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అయితే నోకియా 3210 ఫోన్‌ను లాంచ్‌ చేస్తున్నట్లు సంస్థ ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. పాపులర్‌ ఫీచర్‌ ఫోన్‌ను మళ్లీ విడుదల చేస్తున్నట్లు మాత్రమే తెలిపింది. ఇప్పటికే నోకియా సంస్థ నుంచి 3310, 8210 4G, నోకియా 5710 వంటి ఫోన్‌లు గత కొన్ని సంవత్సరాల్లో మళ్లీ విడుదల అయ్యాయి. ఈ నోకియా 3210 ఫోన్‌లో ఎంతో ప్రసిద్ధి చెందిన స్నేక్‌ గేమ్‌ మరియు బెలూన్‌ గేమ్స్‌ను కలిగి ఉంటుంది. ఈ సంవత్సరం త్వరలో లాంచ్‌ కానున్నట్లు తెలుస్తున్న ఈ ఫోన్‌లో ఈ రెండు గేమ్స్‌ ఉంటాయో లేదో తెలియలేదు. నోకియా ఫోన్ల తయారీ నుంచి HMD సంస్థ తప్పుకుందని. సొంత బ్రాండ్‌ల హ్యాండ్‌సెట్ల తయారీపై దృష్టిసారిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా X ప్లాట్‌ఫాంలో HMD ప్రకటనతో ఈ వార్తలకు చెక్‌పెట్టినట్లు అయింది. అయితే నోకియా కొత్త ఫోన్లతోపాటు పాపులర్‌ మోడళ్లను రీలాంచ్‌ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu