Ad Code

టీసీఎస్‌లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్‌ ఏఐలో శిక్షణ !


నరేటివ్‌ ఏఐ స్కిల్స్‌లో 3.5 లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్లు టీసీఎస్‌ వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో 1.5 లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్లు టీసీఎస్‌ తొలుత వెల్లడించింది. ఆ తర్వాత మరికొందరికి ట్రైనింగ్‌ ఇచ్చింది. అలా ఇప్పటివరకు 3.5 లక్షల మందికి జనరేటివ్‌ ఏఐ విభాగంలో ప్రాథమిక నైపుణ్య శిక్షణ ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. దీంతో సంస్థలో పనిచేస్తున్న వారిలో సగానికి పైగా ఉద్యోగులను ఏఐకు సన్నద్ధం చేసినట్లయింది. ఏఐ విషయంలో టీసీఎస్‌ ఎప్పుడూ ముందువరుసలోనే ఉంటూ వస్తోంది. క్లౌడ్‌, ఏఐ విషయంలో కస్టమర్‌ అవసరాలకు అనుగుణంగా ఆయా విభాగాల కోసం ప్రత్యేక బిజినెస్‌ యూనిట్‌ను తొలుత ఏర్పాటుచేసింది కూడా టీసీఎస్సే. తాజాగా అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ నుంచి జనరేటివ్‌ ఏఐ కాంపిటెన్సీ పార్ట్‌నర్‌ స్టేటస్‌ అందుకున్నట్లు వెల్లడించింది.

Post a Comment

0 Comments

Close Menu