Ad Code

యూట్యూబ్‌లో​​ బోరింగ్ వీడియోలకు చెక్ ?


యూట్యూబ్ కొత్తకొత్త ఫీచర్లను తీసుకొస్తోంది.తమ యూజర్ల సౌకర్యార్ధం ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ కూడిన మూడు కొత్త ఫీచర్లను త్వరలో పరిచయం చేయబోతోంది. ఆ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాక బోరింగ్​, లెంగ్తీ వీడియోలు కూడా యూజర్లకు వినోదాన్ని పంచేలా తయారవుతాయని అంటున్నారు. అందుబాటులోకి రాబోయే ఏఐ ఫీచర్లను వాడుకొని మనం పెద్దపెద్ద వీడియోలను సులువుగా నావిగేట్ చేయొచ్చు. ఆ వీడియోలపై వచ్చే కామెంట్స్‌ను ఈజీగా​ సమ్మరైజ్ చేయొచ్చు. ఎడ్యుకేషన్ వీడియోస్​లో నేరుగా ప్రశ్నలు అడగడానికి, సమాధానాలు రాబట్టడానికి ఛాన్స్ కూడా ఉంటుందట!. పెద్దపెద్ద వీడియోలను పూర్తిగా చూడాలంటే బోర్ కొడుతుంది. అలాంటి వారి కోసం ఏఐ వీడియో నావిగేషన్ టూల్ వస్తోంది. దీని ద్వారా ఒక వీడియోలోని మంచి ఇంట్రెస్టింగ్​ పాయింట్​ వద్దకు లేదా సెగ్మెంట్​ వద్దకు నేరుగా మనం చేరుకోవచ్చకు. ఇందుకోసం మీరు వీడియోపై రెండు సార్లు నొక్కాలి. వెంటనే మీకొక బటన్​ కనిపిస్తుంది. దానిని ట్యాప్ చేయగానే సదరు వీడియోలోని మంచి ఇంట్రెస్టింగ్​ సెగ్మెంట్​లోకి మనం వెళ్లిపోతాం. ప్రస్తుతం ఈ ఏఐ ఫీచర్‌ను​ అమెరికాలోని ప్రీమియం సబ్​స్క్రైబర్లలో ఎంపిక చేసిన వారికి అందుబాటులోకి తెచ్చారు. త్వరలో మిగతా యూజర్లకూ అందుబాటులోకి తెచ్చే ఛాన్స్ ఉంది. పెద్ద వీడియోలలో ఒక్కో పార్ట్‌లో ఒక్కో రకమైన టాపిక్ ఉంటుంది. వాటి కింద నెటిజన్స్ నుంచి కామెంట్స్ వస్తుంటాయి. వాటిని టాపిక్ వైజ్​గా వెతకడానికి 'ఏఐ కేటగిరైజ్డ్ కామెంట్స్' ఫీచర్‌ రాబోతోంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లకు నచ్చిన కంటెంట్ గురించి క్రియేటర్లు తెలుసుకోవచ్చు. తద్వారా యూజర్లకు నచ్చిన వీడియోలను చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. నెగెటివ్​ కామెంట్స్​ను, వీడియోలోని అనవసరమైన భాగాలను తొలగించే వీలు కూడా కలుగుతుంది. ఎడ్యుకేషనల్​ వీడియోల కోసం యూట్యూబ్ Ask అనే సరికొత్త ఏఐ బటన్​ను తీసుకొచ్చింది. దీనితో వీడియోను ఆపకుండానే, నేరుగా ఎడ్యుకేటర్​తో ఇంటరాక్ట్ కావచ్చు. మీరు ‘ఆస్క్’ బటన్​పై క్లిక్ చేసి ప్రశ్నలు పంపొచ్చు. క్రియేటర్లు సమాధానాలు చెప్పొచ్చు. అంటే కంటెంట్ క్రియేటర్లు ఈ ఆప్షన్ ద్వారా క్విజ్ కూడా నిర్వహించొచ్చు. తమ వ్యూయర్లకు కంటెంట్ రికమండేషన్స్ చేయొచ్చు. ఈ మూడు ఏఐ ఫీచర్లు ప్రస్తుతం కొందరు ప్రీమియం యూజర్లకే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే మిగతా యూజర్లకు కూడా అందుబాటులోకి తెచ్చే ఛాన్స్ ఉంది.

Post a Comment

0 Comments

Close Menu