Ad Code

త్వరలో బజాజ్ నుంచి సీఎన్జీ బైక్ ?

 


జాజ్ మొట్ట మొదటి సీఎన్జీ బైకులు తీసుకురాబోతున్నట్లు వెల్లడించింది.. వచ్చె ఏడాది ఈ బైక్ ను విడుదల చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎండి రాజీవ్ బజాజ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ మోటర్ బైక్ ఇంధన ధర నిర్వహణ ఖర్చు 60 శాతం మేరకు తగ్గుతుందంటూ వెల్లడించారు. ఈ బైక్స్ పెట్రోల్ తో పాటు సిఎన్జి పైన కూడా నడుస్తుంది అంటూ తెలియజేశారు. ప్రస్తుతం ఎక్కువగా సీఎన్జీ కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.. ఇందులో దాదాపుగా అన్నీ కూడా ice ఇంజన్ మోడల్స్ కి సీఎన్జీ టచ్ ఇచ్చినవి అంటూ వెల్లడించారు.. మార్కెట్లోకి మాత్రం వరుసగా సిఎన్జి బైక్లను తయారు చేసి విడుదల చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలియజేశారు. ఫ్యూయల్ ఖర్చులు తగ్గేందుకు ప్రయత్నించే కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ఈ బైకులను తీసుకువస్తున్నట్లు తెలియజేశారు.. పల్సర్ ఇతర బ్రాండ్ మోటార్ సైకిల్ లను 90 కంటే ఎక్కువ దేశాలలో ఎగుమతి చేస్తున్నారని తెలిపారు.. చేతక్ కంపెనీ 2020 ఎలక్ట్రిక్ వెహికల్స్ తో మళ్ళీ తిరిగి ప్రవేశించారు సిఎన్జి అనేది ఒక పర్యావరణహితమైనది. ఇందుకు ఖర్చు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది సిఎన్జి తో నడిపే వాహనాలు ముడి దిగుమతులను తగ్గించే విధంగా ప్రభుత్వాలు కూడా అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు చేస్తున్నారని వెల్లడించారు. 

Post a Comment

0 Comments

Close Menu