Ad Code

ఫ్లిప్‌కార్ట్‌లో వివో టీ 2 ప్రో 5జీ ఫోన్ పై భారీ డిస్కౌంట్ !


ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచత్ ధమాల్ సేల్  ఏప్రిల్ 1 నుంచి 7 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో పలు బ్రాండ్ల మొబైల్ ఫోన్లపై భారీ తగ్గింపు ఇస్తున్నారు. Vivo T2 Pro 5G ఫోన్ పై మంచి తగ్గింపు అందించబడుతోంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ బ్యానర్ నుండి అందిన సమాచారం ప్రకారం.. Vivo T2 Pro 5G ఫోన్ రూ. 26,999 కాగా ఇప్పుడు రూ.21,999కి లభిస్తుంది. దీనిని EMI ఆప్షన్ లో కూడా కొనుగోలు చేయవచ్చు. నెలకు రూ.7,334 EMIతో ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అత్యంత వేగవంతమైన ప్రాసెసర్‌తో వస్తుంది.. ఇది 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే వంటి ఫీచర్లను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల పూర్తి-HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz డిస్‌ప్లేతో వినియోగదారులు ఫోన్‌లో సినిమాలు చూసే గొప్ప అనుభూతిని పొందుతారు. దీని స్క్రీన్ 2400 x 1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ Android 13 ఆధారిత Funtouch OS 13 పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB LPDDR4X RAMతో 4nm MediaTek డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఇది 8GB LPDDR4X RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజి సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. దీని వెనుక 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ బొకే షూటర్ ఉంది. సెల్ఫీ కోసం ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. పవర్ కోసం Vivo T2 Pro 5G ఫోన్.. 4600mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ 22 నిమిషాల్లో 0 నుండి 50% వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. భద్రత కోసం, ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.

Post a Comment

0 Comments

Close Menu