Ad Code

76 లక్షల వాట్సప్‌ భారతీయ ఖాతాలపై వేటు ?


భారతీయ ఖాతాలపై వాట్సప్‌  ఫిబ్రవరిలో పెద్దఎత్తున నిషేధం విధించింది. ఐటీ నియమాలు 2021 ఉల్లంఘన, వాట్సప్‌ దుర్వినియోగం చేస్తున్న కారణంగా ఏకంగా 76 లక్షల ఖాతాలను తొలగించినట్లు పేర్కొంది. ఈవిషయాన్ని ఫిబ్రవరి నెలకు సంబంధించిన తన నెలవారీ నివేదికలో ప్రకటించింది. ఫిబ్రవరి 1-29 మధ్య 76,28,000 ఖాతాలను నిషేధించినట్లు వాట్సప్‌ వెల్లడించింది. వీటిలో 14,24,000 ఖాతాలపై ఎలాంటి ఫిర్యాదులూ అందకపోయినప్పటికీ, ఐటీ నిబంధనలను అతిక్రమించినందున ఈ నిర్ణయం తీసుకొన్నట్లు కంపెనీ తెలిపింది. 50 కోట్లకు పైగా యూజర్లు ఉన్న వాట్సప్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో 16,618 వినతులు వచ్చాయి. వాటిలో 22 ఖాతాలపై మాత్రమే 'యాక్షన్' తీసుకున్నట్లు వాట్సప్‌ స్పష్టం చేసింది. అకౌంట్స్ యాక్షన్ అంటే వాట్సాప్ రిపోర్ట్ ఆధారంగా ఆ ఖాతాలను నిషేధించడం లేదా గతంలో బ్యాన్‌ చేసిన ఖాతాల్ని పునరుద్ధరించడం లాంటి చర్యలు చేపట్టే ప్రక్రియ. ఇదిలాఉండగా.. వాట్సప్‌ జనవరి నెలలో 67,28,000 ఖాతాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. వీటిలో కూడా 13,58,000 ఖాతాలకు యూజర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులూ రాకుండానే నిబంధనల ఉల్లంఘన కారణంతో తొలగించినట్లు పేర్కొంది. 

Post a Comment

0 Comments

Close Menu