Ad Code

ఒక్క కఠిన నిర్ణయంతో లాభాల బాట పట్టిన నెట్‌ఫ్లిక్స్‌ !

                                             

వన్‌ డే పాపులర్ షో విడుదల, పాస్‌వర్డ్ షేరింగ్‌ కట్టడి చర్యల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ లాభాలు కొత్త రికార్డును తాకనున్నాయి. వాల్ స్ట్రీట్ అంచనాల ప్రకారం ఈ స్ట్రీమింగ్ దిగ్గజం ఈ సంవత్సరంలో మొదటి మూడు నెలల్లో 4.7 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను సాధించింది. 2020 కోవిడ్‌ లాక్‌డౌన్‌ల తర్వాత సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య పెరుగుదల ఇదే అత్యధికం. అయితే నెట్‌ఫ్లిక్స్‌ ఈ స్థాయిలో పుంజుకోవడానికి పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను కట్టడి చేయడమే కారణంగా తెలుస్తోంది. అయితే 2022లో ప్రకటనలతో కూడిన చౌకైన నెలవారీ చెల్లింపు ప్లాన్‌ను ప్రవేశపెట్టినప్పటి నుండి నెట్‌ఫ్లిక్స్‌కు యూజర్ల సంఖ్య పెరిగింది. రీఫినిటివ్‌ డేటా ప్రకారం నెట్‌ఫ్లిక్స్‌ లాభాలు 50 శాతం కంటే ఎక్కువ పెరిగి దాదాపు రూ. 16 వేల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. కంపెనీకి సంబంధించి ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా మొదటి త్రైమాసికంలో ఇవే అత్యధిక లాభాలు కానున్నాయి. ఇది డిస్నీ, అమెజాన్, యాపిల్ వంటి దిగ్గజాలతో స్ట్రీమింగ్ వార్‌లో నెట్‌ఫ్లిక్స్‌ను దృఢంగా నెలబెట్టనుంది. నెట్‌ఫ్లిక్స్‌ ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. అమెజాన్ ప్రైమ్‌కు 20 కోట్ల మంది, డిస్నీ+కి 15 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.

Post a Comment

0 Comments

Close Menu