Ad Code

పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్‌ల ధరలు ?


లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలోని ప్రజలు మొబైల్ రీఛార్జ్‌పై ఎక్కువ ఖర్చు చేసేందుకు సిద్ధం కావాలని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు టారిఫ్‌లను పెంచేందుకు అన్ని సన్నాహాలు చేశారు. అంటే ఎన్నికల తర్వాత మొబైల్ రీఛార్జ్‌లు ఖరీదైనవి కానున్నాయి.  యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ నివేదిక ప్రకారం సార్వత్రిక ఎన్నికల తర్వాత టెలికాం పరిశ్రమలో టారిఫ్‌లు 15 నుండి 17 శాతం వరకు పెరుగుతాయని అంచనా వేశారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 దశల్లో సాధారణ ఎన్నికలు జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నివేదిక ప్రకారం టెలికాం పరిశ్రమలో టారిఫ్ పెంపు చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత పెంపు ఖాయమని భావిస్తున్నారు. దీని వల్ల భారతీ ఎయిర్‌టెల్‌కే ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. ఎన్నికల తర్వాత పరిశ్రమ ఛార్జీలను 15 నుంచి 17 శాతం పెంచుతుందని భావిస్తున్నామని నివేదిక పేర్కొంది. ఎయిర్‌టెల్ ఫీజును చివరిసారిగా డిసెంబర్ 2021లో దాదాపు 20 శాతం పెంచింది. అంటే దాదాపు 3 ఏళ్ల తర్వాత టారిఫ్‌లు పెరగనున్నాయి. ఎయిర్‌టెల్ రూ. 208 రీచార్జ్ రూ.286 రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది.భారతి ఎయిర్‌టెల్ కస్టమర్ బేస్ సంవత్సరానికి రెండు శాతం పెరుగుతుందని భావిస్తున్నామని నిపుణులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్ 2018లో వోడాఫోన్ ఐడియా మార్కెట్ వాటా 37.2 శాతం నుండి దాదాపు సగానికి అంటే 2023 డిసెంబర్‌లో 19.3 శాతానికి పడిపోయిందని నివేదిక పేర్కొంది. ఈ కాలంలో భారతి మార్కెట్ వాటా 29.4 శాతం నుండి 33 శాతానికి పెరిగింది. ఈ కాలంలో జియో మార్కెట్ వాటా 21.6 శాతం నుంచి 39.7 శాతానికి పెరిగింది.

Post a Comment

0 Comments

Close Menu