Ad Code

సుజుకి హయబుసా బైక్ విడుదల !


సుజుకి మోటార్‌ సైకిల్ ఇండియా సుజుకి హయబుసా 25వ యానివర్శరీ సెలబ్రేషన్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. దీని ధర 17.70 లక్షలు (ఎక్స్-షోరూమ్). 1998లో జర్మనీలోని ఇంటర్‌మోట్‌లో సుజుకి హయాబుసా జీఎస్ఎక్స్1300ఆర్ మోడల్‌గా ఆవిష్కరించింది. ఈ లెజెండరీ మోటార్‌సైకిల్ విక్రయాలు 1999లో ప్రారంభమయ్యాయి. భారత మార్కెట్లో ప్రొడక్టు, సేల్స్ 2016లో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం విక్రయిస్తున్న థర్డ్ జనరేషన్ మోడల్ 2021లో మార్కెట్‌లోకి ప్రవేశించింది. మోటార్‌సైకిల్‌లో ప్రస్తుత మూడో జనరేషన్ హయాబుసా మాదిరిగా అదే 1,340సీసీ ఇన్-లైన్ 4-సిలిండర్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ లిక్విడ్-కూల్డ్ డీఓహెచ్‌సీ ఇంజన్‌ని ఉపయోగించారు. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌లు, బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్ట్ సిస్టమ్‌లతో సుజుకి ఇంటెలిజెంట్ రైడ్ సిస్టమ్ (SIRS)తో అమర్చింది. ఆరెంజ్, బ్లాక్-బేస్డ్ బాడీని కలిగిన హయబుసా 25వ వార్షికోత్సవ ఎడిషన్‌లో గోల్డ్ యానోడైజ్డ్ డ్రైవ్ చైన్ అడ్జస్టర్, ఫ్రంట్ బ్రేక్ డిస్క్ ఇన్నర్, మఫ్లర్ బాడీ, డ్రైవ్ చైన్‌పై ఒరిజినల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ట్యాంక్‌పై 25వ వార్షికోత్సవ ఐకాన్, ట్రి డైమన్షనల్ సుజుకి లోగో ఉన్నాయి. సింగిల్ సీట్ కౌలింగ్ ఇప్పుడు ఈ సెలబ్రేటరీ ఎడిషన్‌లో స్టాండర్డ్ ఈక్వెమెంట్‌గా వస్తుంది. సుజుకి హయాబుసా 25ఏళ్లకు పైగా స్పీడ్, డిజైన్ పరంగా ఐకాన్‌గా నిలిచింది. 25వ వార్షికోత్సవ సెలబ్రేషన్ ఎడిషన్‌ లాంచ్ సందర్భంగా ఈ అద్భుతమైన ప్రయాణాన్ని స్మరించుకుంటామని సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఉమెడ అన్నారు.




Post a Comment

0 Comments

Close Menu