Ad Code

పోకో M7 ప్రో 5జీ పేరుతో రీబ్రాండ్ వెర్షన్ రెడ్‌మి 13 5జీ ఫోన్ ?


దేశీయ మార్కెట్లోకి పోకో ఎమ్7ప్రో 5జీగా రీబ్రాండ్ అయి రెడ్‌మి 13 5జీ ఫోన్ రానుంది. రెడ్‌మి 13 5జీ మాదిరి పోకో ఎమ్7ప్రో 5జీ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. గత ఏడాదిలో రెడ్‌మి 12 5జీ ఫోన్ అదే చిప్‌సెట్ కలిగి ఉంది. వాస్తవానికి.. రెడ్‌మి 12 5జీ కన్నా రెడ్‌మి 13 5జీ అప్‌గ్రేడ్ వెర్షన్లతో రానుందని నివేదికలు సూచిస్తున్నాయి. రెడ్‌మి 13 5జీ ఫోన్ 2406ఈఆర్ఎన్9సిఐ, 2406ఈఆర్ఎన్9సీసీ, 24066పీసీ95ఐ వంటి విభిన్న మోడల్ నంబర్‌లతో వస్తుంది. ఈ ఫోన్ ఎక్కడ విక్రయించనుందో ఈ నంబర్లు తెలియజేస్తాయి. 'RN' అంటే.. రెడ్‌మి బ్రాండ్ కింద 'PC' అంటే.. POCO బ్రాండ్. ఉదాహరణకు, భారత్ మార్కెట్లో '2406ERN9CI', చైనా '2406ERN9CC' మోడల్ కాగా.. '24066PC95I' అనే మోడల్ నంబర్ రెడ్‌మి 13 5జీ ఫోన్ అని సూచిస్తుంది. గత మోడల్‌ విధానాన్ని అనుసరించి పోకో ఎమ్7ప్రో 5జీ అని సూచిస్తుంది. అయితే, ఈ పేరు ఇంకా అధికారికం కాదని గమనించాలి. రెడ్‌మి 13 5జీ ఫోన్ కొన్ని చిన్నమార్పులతో రెడ్‌మి 12 5జీ పోలి ఉంటుంది.  రెడ్‌మి 12 5జీ కన్నా రెడ్‌మి 13 5జీ అప్‌గ్రేడ్ ఫీచర్లను కలిగి ఉండనుందని నివేదిక సూచిస్తోంది. రాబోయే రెడ్‌మి 13 5జీ ఫోన్ రెడ్‌మి 12 5జీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 5జీ కనెక్టివిటీని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 50ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దాంతో పాటు 2ఎంపీ డెప్త్ సెన్సార్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. రెడ్‌మి 12 5జీ ఫోన్ 5,000ఎంఎహెచ్ బ్యాటరీ, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ద్వారా 18డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ స్పెషిఫికేషన్లతో రెడ్‌మి 12 5జీ అద్భుతమైన పర్ఫార్మెన్స్, మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. బడ్జెట్ విభాగంలో ఇదో బెస్ట్ ఆప్షన్. రెడ్‌మి 13 5జీ ఎంట్రీ-లెవల్ మార్కెట్‌లో ఆ స్థానాన్ని నిలబెట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. 

Post a Comment

0 Comments

Close Menu