వచ్చే నెలలో టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ ఫోన్‌ను టెక్నో సంస్థ గ్లోబల్ మార్కెట్లతోపాటు భారత్ మార్కెట్లో ఆవిష్కరిస్తారని తెలుస్తోంది. 108-మెగా పిక్సెల్ సెన్సర్ మెయిన్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 1080×2460 పిక్సెల్స్ రిజొల్యూషన్ తోపాటు 6.78 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్ సెట్ తో వస్తోంది. టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ ఫోన్ లో సెల్ఫీలూ వీడియోకాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 33వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. స్క్వేరిష్ రేర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ తోపాటు ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తోందీ ఫోన్. టెక్నో స్పార్క్ 20 ప్రో 5జీ ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ.14 వేల నుంచి రూ.16 వేల లోపు ఉంటుందని భావిస్తున్నారు. మూడు రంగుల ఆప్షన్లలో టెక్నో స్పార్క్ 20ప్రో 5జీ ఫోన్ వస్తున్నది.
0 Comments