Ad Code

22న రియల్ మీ జీటీ 6టీ స్మార్ట్ ఫోన్ విడుదల !


దేశీయ మార్కెట్లో రియల్ మీ GT 6T స్మార్ట్ ఫోన్ ను మే 22న విడుదల చేయనుంది. ఈ ఫోన్ ను ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా అమెజాన్ టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ సన్నని మరియు షైనీ డిజైన్ లో వెనుక డ్యూయల్ కెమెరా తో కనిపిస్తోంది.  Snapdragon 7+ Gen 3 చిప్ సెట్ తో ఇండియాలో విడుదల కానున్న మొదటి ఫోన్ అని కూడా కంపెనీ తెలిపింది. ఈ చిప్ సెట్ 1.5 M AnTuTu స్కోర్ తో పర్ఫార్మెన్స్ అందిస్తుందని కూడా రియల్ మీ టీజింగ్ ద్వారా తెలిపింది. 120W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500 mAh బిగ్ బ్యాటరీతో అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ Curved డిస్ప్లే మరియు టైప్-C ఛార్జ్ పోర్ట్ ఉన్నట్లు కూడా కనిపిస్తోంది. 

Post a Comment

0 Comments

Close Menu