Ad Code

మే 27న శాంసంగ్‌ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల !


శాంసంగ్‌ గెలాక్సీ F55 5G స్మార్ట్‌ఫోన్‌ మే 27న దేశీయ మార్కెట్‌లోకి విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకొనే డిజైన్‌తో సహా వేగాన్‌ లెదర్‌ ఫినిష్‌ను కలిగి ఉంది. 6.7 అంగుళాల పుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌+ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 2400*1080 పిక్సల్‌ రిజల్యూషన్‌, 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్‌ కానుందని సమాచారం. ఈ హ్యాండ్‌సెట్‌ వేగాన్ లెదర్‌ ఫినిష్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత One UI పైన పనిచేస్తుందని తెలుస్తోంది. నాలుగు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, 5 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందవచ్చని తెలుస్తోంది. స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్‌ 1 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. గరిష్ఠంగా 12GB ర్యామ్‌ మరియు 256GB అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2MP మ్యాక్రో కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు 50MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 45W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డాల్బీ అట్మా్స్‌ సపోర్టు, బ్లూటూత్‌ 5.3, వైఫై, GPS, NFC వంటి ఫీచర్లతో విడుదల కానుంది. 

Post a Comment

0 Comments

Close Menu