Ad Code

త్వరలో లాంచ్‌ కానున్న మోటోరోలా రేజర్‌ 50 అల్ట్రా ?


మోటోరోలా రేజర్‌ 50 అల్ట్రా హ్యాండ్‌సెట్‌ గ్లోబల్‌ మార్కెట్‌లో లాంచ్‌ కానుంది. గతంలో రేజర్‌ 40 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో విడుదల అయింది. రేజర్‌ 50 అల్ట్రా మోడల్‌ ఇటీవల బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ వెబ్‌సైట్‌ సహా EEC లో కనిపించింది. ఇటాలియన్‌ రిటైలర్‌ నుంచి లీక్‌ అయిన సమాచారం ఆధారంగా మోటోరోలా రేజర్‌ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ 12GB ర్యామ్‌, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర €1200 గా ఉంది. భారత కరెన్సీ ప్రకారం రూ.1,07,634 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుంది. ముందువైపు పంచ్‌హోల్‌ ను సెల్ఫీ కెమెరా కోసం వినియోగించారు. 40 అల్ట్రా హ్యాండ్‌సెట్‌తో పోలిస్తే రేజర్‌ 50 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ సన్నని బెజెల్స్‌ను కలిగి ఉంటుంది. గత మోడల్‌తో పోలిస్తే అప్‌గ్రేడ్ చేయబడిన సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉండవచ్చు. 6.9 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్‌ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 7 ప్లస్‌ జెన్‌ 2 ప్రాసెసర్‌ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ల వివరాల గురించి తెలియాల్సి ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ పీచ్‌ ఫజ్‌, బ్లూ, గ్రీన్‌ రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది. కెమెరా విభాగం పరంగా ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అందులో 64MP ప్రధాన కెమెరా సహా మరిన్ని కెమెరాలు ఉండనున్నాయి. అదే విధంగా సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 


Post a Comment

0 Comments

Close Menu