Ad Code

గూగుల్‌ పిక్సల్‌ 8a స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం !


గూగుల్‌ పిక్సల్ 8a స్మార్ట్‌ ఫోన్‌ ఈనెల 7న విడుదల అయింది. ఈ గూగుల్‌ ఫోన్‌ సేల్‌ ఈరోజు నుంచి ప్రారంభం అయింది. గూగుల్‌ పిక్సల్‌ 8a స్మార్ట్‌ఫోన్‌ 6.1 అంగుళాల OLED Actua డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 2000 వరకు గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను పొందుతుంది. డిస్‌ప్లే రక్షణకు ఈ హ్యాండ్‌సెట్ కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్ రక్షణను పొందుతుంది. ఈ డిస్‌ప్లే HDR సపోర్టును కలిగి ఉంటుంది. గూగుల్‌ ప్రకారం గూగుల్‌ పిక్సల్‌ 8a స్మార్ట్‌ఫోన్‌ గత మోడల్‌ కంటే 40 శాతం బ్రైట్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. డిజైన్‌ పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ ఆకట్టుకుంటుంది. దీంతోపాటు మెరుగైన స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. ఈ గూగుల్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌ Tensor G3 చిప్‌ సహా టైటాన్‌ M2 సెక్యూరిటీ కో ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌లు గరిష్ఠంగా 8GB LPDDR5x ర్యామ్‌ తో జతచేయబడతాయి. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OS ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 7 సంవత్సరాలపాటు పాటు ఆండ్రాయిడ్‌, సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని గూగుల్ తెలిపింది. గూగుల్‌ పిక్సల్‌ 8a స్మార్ట్‌ఫోన్‌ 64MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రా వైడ్‌ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 13MP కెమెరాను అమర్చారు. ఈ కెమెరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్‌లను కలిగి ఉంటాయి. గ్రూప్‌ ఫోటోల కోసం బెస్ట్‌ టేక్‌, మేజిక్‌ ఎడిటర్, ఆడియో మేజిక్‌ ఎరేజర్‌ను కలిగి ఉంటుంది. ఈ గూగుల్‌ ఫోన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్‌ జెమిని.. ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. మరియు సర్కిల్‌ టూ సెర్చ్‌ ఫీచర్‌ సహా ఆడియో ఎమోజీలను కూడా కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 4492mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఒక్కరోజుపాటు పూర్తిగా వినియోగించుకొనే అవకాశం ఉంటుందని సంస్థ చెబుతోంది. ఛార్జర్‌ను ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని సంస్థ తెలిపింది.అలో, బే, అబ్సిడియన్, పార్సిలియన్‌ రంగుల్లో లభిస్తుంది. 

Post a Comment

0 Comments

Close Menu