Ad Code

మహిళలకు సూపర్ సేఫ్టీ. 'మై సేఫ్టీ పిన్ యాప్'


దువు కోసం, ఉద్యోగం కోసం, ఏదైనా పని కోసం ఇంటి నుంచి బయటికి ఒంటరిగా వెళ్లే మహిళలు తిరిగొచ్చే వరకు కుటుంబీకులకు భయంభయంగా ఉంటోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగిన ఈ కాలంలో ఒక గొప్ప తరుణోపాయం ఉంది. అదే.. “మై సేఫ్టీపిన్​ యాప్”. దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనం తిరిగే సిటీలోని సురక్షితమైన, అసురక్షితమైన ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని అందించే క్రౌడ్ సోర్స్ యాప్ ఇది. మహిళా హక్కుల కార్యకర్త కల్పనా విశ్వనాథ్‌, ఆశిష్‌ బసు సంయుక్తంగా 2013లో ఈ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్నాక మన లోకేషన్‌ వివరాలను అడుగుతుంది. లొకేషన్‌ను యాక్సెస్ చేసేందుకు అనుమతి ఇవ్వాలి. మన పేరు, ఫోన్‌ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ వెంటనే మన ఫోన్‌కి ఒక ఓటీపీ నంబరు వస్తుంది. ఆ ఓటీపీ నంబరుతోనే మనం 'మై సేఫ్టీ పిన్' యాప్‌లోకి లాగిన్ కావచ్చు. ఈ యాప్‌లోకి లాగిన్ అయ్యేటప్పుడు  ఏదైనా ఆపద వస్తే లొకేషన్ వివరాలు అందగానే అందుబాటులోకి వచ్చి, రక్షించగలిగే ఐదుగురు వ్యక్తుల ఫోన్‌ నంబర్లను కూడా యాప్‌లో సేవ్ చేయాల్సి ఉంటుంది. ప్రత్యేకించి మహిళలు రాత్రి టైంలో ఎక్కడికైనా ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఈ యాప్‌ను ఆన్ చేస్తే.. వెళ్తున్న లొకేషన్ల సమాచారమంతా ట్రాక్ అవుతుంది. ప్రస్తుతమున్న లొకేషన్ వివరాలు కూడా కనిపిస్తాయి. ఈ యాప్‌ ద్వారా మీ ఫ్యామిలీ మెంబర్స్‌కు ఎప్పటికప్పుడూ మెసేజ్‌ల రూపంలో సందేశాలు వెళ్తుంటాయి. క్యాబ్‌లు, బస్‌లు ఎక్కినప్పుడు మన లోకేషన్‌ను తెలిసిన వారికి షేర్‌ చేస్తే… వాళ్లు సులువుగా మనల్ని ట్రాక్‌ చేసేయొచ్చు. ప్రయాణం చేసే క్రమంలో మనకు రక్షణ లేదని అనిపించినప్పుడు.. ఏదైనా ఆపద చుట్టుముట్టినప్పుడు ఈ అప్లికేషన్‌ను ఆన్ చేసి.. 'ఫైండ్‌ సపోర్ట్‌' అనే ఆప్షన్‌ను నొక్కగానే మనల్ని రక్షించే వాళ్లందరి ఫోన్లకు మెసేజ్ వెళ్లిపోతుంది. ఏదైనా కొత్త ప్రాంతానికి మనం వెళ్లినప్పుడు అక్కడున్న సౌకర్యాల గురించి, బస్‌స్టేషన్‌, రైల్వే స్టేషన్‌, పోలీస్‌ స్టేషన్‌, ఆసుపత్రి తదితర వివరాలను తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ వాడుతున్న వారు తప్పిపోతే.. వారి లొకేషన్‌ను ఈజీగా గుర్తించవచ్చు. మనం అసురక్షితమైన ప్రదేశంలో ఉంటే ఆటోమెటిక్‌గా యాప్‌లో నమోదు చేసిన నెంబర్లకు.. లొకేషన్‌తో కూడిన నోటిఫికేషన్లు వెళ్తాయి. అందుకే ఈ యాప్‌ను మహిళ ఫోన్లలో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu