Ad Code

ఇడియట్ సిండ్రోమ్ అంటే ...... !


డియట్ అంటే తెలివి తక్కువవాడు అనే మీనింగ్ కాదు. ఈ పదానికి ఫుల్ ఫామ్ వేరే ఉంది. ఇడియట్ అంటే 'ఇంటర్నెట్ డెరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్స్ట్రక్షన్ ట్రీట్మెంట్'. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని చూసి, అదే నిజమని భావించి.. డాక్టర్లతో చికిత్సను చేయించుకోవడంలో జాప్యం జరగడం అని అర్థం. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్‌కు చెందిన 'క్యూరియస్‌' అనే జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి. దీని ప్రకారం ఇడియట్ సమస్య ఉన్న రోగులు ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా దానిపైనే తరుచుగా ఇంటర్నెట్ సెర్చ్ చేస్తుంటారు. చికిత్స కోసం వైద్యుల వద్దకు వెళ్లడం కంటే ఇంటర్నెట్ సూచించే మందులను వాడటమే మంచిదని భావిస్తారు. సొంతంగా వైద్యం చేసుకుంటారు. ఇలా వైద్యం చేసుకోవడం అపాయకరమని, సొంతంగా తీసుకునే మందులు వికటించే రిస్క్ ఉంటుందని అధ్యయన నివేదిక తెలిపింది. ఇంటర్నెట్‌లో వివిధ వ్యాధుల సమాచారం, చికిత్సల సమాచారం ఉంటుంది. అలా అని పూర్తిగా దాన్నే నమ్మడం, దాని ఆధారంగా స్వీయ చికిత్స తీసుకోవడం కూడా ఒక వ్యాధి లాంటిదే అని నిపుణులు అంటున్నారు. ఇంటర్నెట్‌కు బానిసగా మారి.. నేరుగా చికిత్స అందించే వైద్యులపై నమ్మకాన్ని కోల్పోవడం వల్ల కొందరు నెటిజన్స్ 'ఇడియట్స్'గా మారుతున్నారని చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ రకమైన మానసిక స్థితిని “ఇన్ఫోడెమిక్”గా పిలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu