Ad Code

జియోమార్ట్ డిజిటల్‌తో జత కట్టిన వన్‌ప్లస్ !


జియోమార్ట్ డిజిటల్ సంస్థతో వన్‌ప్లస్ జత కట్టింది. రెండు సంస్థల భాగస్వామ్యం వల్ల భారత్ మార్కెట్లో రిటైల్ సేల్స్ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. తాజాగా రిలయన్స్ జియో మార్ట్ డిజిటల్‌తో భాగస్వామ్యంతో దేశంలోని 2000కి పైగా నగరాలు, పట్టణాల్లోకి వన్ ప్లస్ ఉత్పత్తులు విస్తరించడానికి చాన్స్ ఏర్పడుతుందని తెలుస్తున్నది. జియోమార్ట్ డిజిటల్‌కు దేశవ్యాప్తంగా 63 వేలకు పైగా రిటైల్ స్టోర్ల పంపిణీ నెట్‌వర్క్ ఉంది. దేశంలోని త్రీటైర్, ఫోర్ టైర్ నగరాల్లోనూ వన్‌ప్లస్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. జియోమార్ట్ డిజిటల్ తో భాగస్వామ్యం వల్ల స్మార్ట్ ఫోన్లు, ఇయర్ బడ్స్, వేరబుల్స్, ఇతర ఉత్పత్తుల విక్రయానికి దోహద పడుతుందని వన్ ప్లస్ తెలిపింది. కొత్తగా మార్కెట్లో ఆవిష్కరించిన వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 ఫోన్ 8జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ సేల్స్‌తో వన్ ప్లస్ ఫుట్ ప్రింట్ పెరుగనున్నది.

Post a Comment

0 Comments

Close Menu