Ad Code

ఐఫోన్ లో చాట్ జీపీటీ సేవలు ?


ప్రపంచవ్యాప్తంగా పేరొందిన టెక్నాలజీ సంస్థలు ఏఐ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చాయి. పలు కంపెనీలు కొత్తగా మార్కెట్లో ఆవిష్కరించిన స్మార్ట్ ఫోన్లలో ఏఐ ఫీచర్లు జత చేశాయి. ఆ బాటలో గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ కూడా చేరింది.కొత్తగా తేనున్న ఐఓఎస్18లో ఆపిల్.. ఏఐ ఆధారిత ఫీచర్లు జత చేసేందుకు కసరత్తు చేస్తున్నది. అందుకోసం చాట్‌జీపీటీ పేరెంట్ సంస్థ ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకోనున్నది. ఇందుకోసం రెండు కంపెనీల మధ్య ఒప్పందం ఖరారైనట్లు ప్రముఖ వార్తా సంస్థ బ్లూంబర్గ్ ఓ వార్తా కథనం ప్రచురించింది. ఈ ఏడాది చివర్లో ఆవిష్కరించే ఐఫోన్-16 సిరీస్ ఫోన్లలోనూ ఆపిల్ జనరేటివ్ ఏఐ ఫీచర్లు ప్రవేశ పెట్టనున్నది. ప్రస్తుతం మార్కెట్లో విడుదలైన గూగుల్ పిక్సెల్ 8, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్లలోనూ ఏఐ ఆధారిత టూల్స్, యాప్స్ జత చేశారు. కానీ ఈ విషయమై వెనుకబడ్డ ఆపిల్.. ఐఓఎస్ 18 వర్షన్‌తో ఆ లోటును భర్తీ చేయనున్నది.

Post a Comment

0 Comments

Close Menu