Ad Code

త్వరలో పోకో ప్యాడ్‌ 5G ?


పోకో ప్యాడ్‌ 5G వేరియంట్ బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ సర్టిఫికేషన్‌ను  పొందింది. దీని ఆధారంగా భారత్‌లో విడుదల కానుందని ధృవీకరణ అయింది. పోకో మే నెలలో పోకో ప్యాడ్‌ వైఫై వేరియంట్‌ ను విడుదల చేయగా, త్వరలో 5G వేరియంట్‌ను విడుదల చేయనుంది. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌ సర్టిఫికేషన్‌ వెబ్‌ సైట్‌ లో 24074PCD2I మోడల్‌ నంబర్‌తో కనిపించింది. ఈ లిస్టింగ్‌ ఆధారంగా పోకో ప్యాడ్‌ 16:10 ఆస్పెక్ట్‌ రేషియోను కలిగి ఉంటుంది. గత నెలలో చైనాలో లాంచ్ అయిన రెడ్‌మి ప్యాడ్‌ ప్రో 5G కు రీ బ్రాండెడ్‌ వెర్షన్‌ గా పోకో ప్యాడ్‌ లాంచ్‌ కానుందని తెలుస్తోంది. పోకో తొలి ప్యాడ్‌ 2560*1600 పిక్సల్‌ రిజల్యూషన్‌తో 12.1 అంగుళాల IPS LCD డిస్‌ప్లే ను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంటుంది.ఈ పోకో ప్యాడ్‌ స్నాప్‌ డ్రాగన్ 7s జెన్ 2 చిప్‌ సెట్‌ పైన పనిచేస్తుంది. మరియు 8GB LPDDR4X ర్యామ్‌ మరియు 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేయబడుతుంది. మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత షియోమీ HyperOS పై పనిచేయనుంది. దీంతోపాటు ఈ పోకో ప్యాడ్‌ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 10,000mAh బ్యాటరీతో విడుదల కానుంది. కెమెరాల పరంగా ఈ ప్యాడ్‌ వెనుక వైపు 8MP కెమెరా మరియు ముందు వైపు 8MP కెమెరాను కలిగి ఉంటుంది. 


Post a Comment

0 Comments

Close Menu