Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label ఈ స్కూటర్‌లో 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. Show all posts
Showing posts with label ఈ స్కూటర్‌లో 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. Show all posts

Monday, April 3, 2023

ఓలా ఎస్1 ప్రో స్కూటర్ పై రూ. 5 వేలు తగ్గింపు !


ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. తన టాప్ ఎండ్ మోడల్ ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఓలా ఎస్ 1 ప్రో మోడల్‌ ధరను రూ. 5 వేలు తగ్గించింది. ఓలా ఎస్1 ప్రో ధర ఇది వరకు రూ. 1,29,999గా ఉండేది. అయితే ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 5 వేలు తగ్గడంతో రూ. 1,24,999కు దిగి వచ్చింది. ఇకపోతే ఈ స్కూటర్‌లో 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 116 కిలోమీటర్లు. ఇక రేంజ్ విషయానికి వస్తే.. ఒక్కసారి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఫుల్‌గా చార్జింగ్ పెడితే 181 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ పేర్కొంటోంది. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.9 సెకన్లలోనే అందుకుంటుంది. చార్జింగ్ టైమ్ విషయానికి వస్తే.. బ్యాటరీ ఫుల్ కావడానికి 6.3 గంటలు పడుతుంది. మోటార్ పవర్ 8.5 కేడబ్ల్యూ. బూట్ స్పేస్ 36 లీటర్లు. ఇందులో నార్మల్, ఎకో, స్పోర్ట్, హైపర్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి. ఇందులో 7 ఇంచుల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అమర్చారు. ఇది వివిధ రంగుల ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. క్రెడిట్ కార్డు ద్వారా కొంటే 5 శాతం తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఇంకా లోన్ తీసుకొని స్కూటర్ కొంటే జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ ఉంది. ఇంకా తక్కువ వడ్డీ రేటుకే రుణం పొందొచ్చు. అందువల్ల మీరు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే యోచనలో ఉంటే మాత్రం ఈ తగ్గింపు ఆఫర్లను సొంతం చేసుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ సీఈవో ట్విట్టర్ వేదికగా ఈ ధర తగ్గింపు అంశాన్ని ప్రకటించారు.

Popular Posts