Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Showing posts with label Hero motors. Show all posts
Showing posts with label Hero motors. Show all posts

Thursday, April 13, 2023

హీరో ఎలక్ట్రిక్ నుంచి వీదా వీ1 ప్రో, వీదా వీ1 ప్లస్ స్కూటర్లు !


హీరో మోటోకార్ప్ నుంచి కొన్నాళ్ల క్రితం తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్ అయింది. వీ1 సిరీస్‌లో వీదా వీ1 ప్రో, వీదా వీ1 ప్లస్  పేరుతో కంపెనీ రెండు ఇ-స్కూటర్లను లాంఛ్ చేసింది. హీరో అధికారిక వెబ్‌సైట్‌లో ఈ స్కూటర్ బుక్ చేయొచ్చు. వీదా అంటే స్పానిష్‌లో లైఫ్ అని అర్థం. ఆ పేరుతో రెండు స్కూటర్లను పరిచయం చేసింది. హీరో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఆన్‌లైన్‌లో వీదా వీ1 స్కూటర్లను కొనొచ్చు. వీదా వీ1 ప్రో హైదరాబాద్ ధరలు ఎక్స్ షోరూమ్ ధర రూ.1,99,999. పోర్టబుల్ ఛార్జర్‌కు రూ.20,000 చెల్లించాలి. మొత్తం కలిపి రూ.2,19,999 అవుతుంది. ఫేమ్ 2 సబ్సిడీ రూ.60,000 వర్తిస్తుంది. ఈ లెక్కన రూ.1,59,999 ధరకే వీదా వీ1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనొచ్చు. వైట్, రెడ్, ఆరెంజ్ కలర్స్‌లో ఉన్నాయి.  వీదా వీ1 ప్లస్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1,76,999. పోర్టబుల్ ఛార్జర్‌కు రూ.20,000 చెల్లించాలి. మొత్తం కలిపి రూ.1,96,999 అవుతుంది. ఫేమ్ 2 సబ్సిడీ రూ.51,000 వర్తిస్తుంది. ఈ లెక్కన రూ.1,45,999 ధరకే వీదా వీ1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనొచ్చు. వైట్, రెడ్ కలర్స్‌లో లభిస్తుంది.  ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉన్న తయారీ యూనిట్‌లో వీదా ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తోంది హీరో మోటోకార్ప్. వీదా వీ1 ప్రో, వీదా వీ1 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఓలా ఎస్1, టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చెతక్, ఏథర్ 450X లాంటి మోడల్స్‌కు పోటీ ఇవ్వనున్నాయి.  దీనిలో 3.94 kWh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 165 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 5 గంటల 55 నిమిషాల సమయం పడుతుంది. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.2 సెకండ్లలో అందుకోవచ్చు. ఈకో, స్పోర్ట్, రైడ్, కస్టమ్ మోడ్స్ ఉంటాయి. వీదా వీ1 ప్లస్ ఫీచర్స్ చూస్తే 3.44 kWh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 143 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 5 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.4 సెకండ్లలో అందుకోవచ్చు. ఈకో, స్పోర్ట్, రైడ్ మోడ్స్ ఉంటాయి.  ఈ రెండు స్కూటర్లలో కామన్ ఫీచర్స్ చూస్తే టూవే థ్రాటల్, క్రూజ్ కంట్రోల్, టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, పార్కింగ్ కోసం అసిస్టెన్స్, డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకునే ఫీచర్స్ ఉన్నాయి. 7 అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్, ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్, కీలెస్ కంట్రోల్, ఎస్ఓఎస్ అలర్ట్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

Friday, October 8, 2021

ఎక్స్‌ప్లస్‌ 200 4వీ ని ప్రవేశపెట్టిన హీరో

  

దేశీయ మార్కెట్లోకి హీరో మరో మోటార్‌ సైకిల్‌ 'ఎక్స్‌ప్లస్‌ 200 4వీ'ని ప్రవేశపెట్టింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1.28లక్షలు. అడ్వెంచర్‌ మోటార్‌ సైక్లింగ్‌లో ఎంట్రి లెవల్‌ వాహనమైన ఎక్స్‌ప్లస్‌కు ఫోర్‌వాల్వ్‌ టెక్నాలజీని వినియోగించింది. దీనికి 199.6 సీసీ సింగిల్‌ సిలిండర్‌, ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 18.8 బీహెచ్‌పీ శక్తిని, 17.35 ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ను విడుదల చేస్తుంది. గతంలో ఉన్న టూవాల్స్‌ టెక్నాలజీ ఇంజిన్‌ 17.8 బీహెచ్‌పీ శక్తిని మాత్రమే విడుదల చేస్తుంది. కొత్త ఇంజిన్‌తో శక్తి ఆరుశాతం, టార్క్‌ ఐదు శాతం పెరిగాయి. ధరలో కూడా రూ.5000 ఎక్కువ. సరికొత్త బైక్‌లో కూలింగ్‌ వ్యవస్థను కూడా 7ఫిన్‌ ఆయిల్‌ ఫిల్టర్లతో మరింత మెరుగు పర్చినట్లు హీరో పేర్కొంది. వేగం, పట్టు కోసం గేర్‌ వ్యవస్థలో మార్పులు చేశామని, వైబ్రేషన్స్‌ తగ్గించినట్లు తెలిపింది. ఈ బైకు ట్రెయిల్‌బ్లూ, బ్లిట్జ్‌ బ్లూ, రెడ్‌ రైడ్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇంటిగ్రేడ్‌ స్టార్టర్‌, ఇంజిన్‌ కటాఫ్‌ స్విచ్‌, సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్‌, ఎల్‌ఈడీ టెయిల్‌ లైట్‌, బ్లూటూత్‌ అనుసంధానించే ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, ఏబీఎస్‌ ఫీచర్లు ఉన్నాయి.

Popular Posts